Previous Page Next Page 
నిశాగీతం పేజి 32


    "ఉదయ్ తోవలోనే ఏదైనా జరగొచ్చు. ఎందుకయినా మంచిది. విల్సన్ తొ మాట్లాడి ఇద్దరు  కానిస్టేబుల్స్ ను ఎస్కార్టుగా  పంపించమంటాను ఏమంటావు?"
    "గుడ్ ఐడియా. ఫోన్ చెయ్ విల్సన్ కు."
    "అలాగే ఇంతకీ ఆ మహానుభావుడు ఈ టైంలో ఎక్కడున్నాడో ఏ మూడ్ లో వున్నాడో? అయినా ప్రయత్నిస్తాను. నువ్వూ మాధవీ నా గదిలో కూర్చుని రిలాక్స్ అవండి. మా మేట్రన్ కాఫీ ఏమైనా ఏర్పాటు చేస్తుందేమో చూస్తాను." అని  జయంత్ స్ప్రింగ్ డోర్  తీసుకుని బయటికి వెళ్ళాడు.
    డాక్టర్ ఉదయ్ చంద్ర, మాధవీ జయంత్ ప్రైవేట్ రూంలోకి వెళ్ళి కూర్చుంటుండగా గదిలో గోడగడియారం పదకొండు సార్లు  మ్రోగిపన్నెండో గంట  కొట్టడానికి సిద్దమవుతుంది.
    "పదినిముషాల తర్వాత వేడివేడి కాఫీ తెచ్చాడు బాయ్.
    కాఫీ సిప్ చేస్తూ తలతిప్పి మాధవివంక చూశాడు. ఆమె తననే  ఓరగా చూస్తూండటం గమనించాడు. పెదవులపై వేడి వేడి హాసరేఖలు కదిలి ఇట్టే  మాయమయ్యాయి.
    ఇద్దరిమధ్యా మౌనం భరించలేనిదిగా వుంది.
    ఆమె కళ్ళు  మిలమిలా  మెరిసిపోతున్నాయి.
    ఫాన్ గాలికి ఎగురుతున్న ముంగురులు ఆమె చంపలమీద అల్లరిగా ఆడుకుంటున్నాయి.
    నీరసంగా వున్న ఆమె ముఖంలోకి దీక్షగా చూశాడు ఉదయ్.
    "లక్షరూపాయలకు ఆశించి ప్రాణంమీదికి తెచ్చుకొన్నావ్."
    మాధవి  కళ్ళలోని వెలుగు ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ చ్సినట్టు ఆరిపోయింది.
    "డబ్బుకోసంకాదు. సినిమాతారగా ఉజ్వల భవిష్యత్తును ఆశించాను. తారలకు తారగా వెలిగిపోవాలని ఆశపడ్డాను పాప్యులారిటీతొపాటు లక్షలకు లక్షలు ఆరించి, రాంబాబునూ, శివరామయ్యనూ, నా ఇంటి గుమ్మంముందు కాపలా కుక్కల్లా తిప్పుకోవాలని అనుకొన్నాను. అందుకే వాళ్ళు చెప్పిందల్లా చేశాను. వాళ్ళు  ఆడమన్నట్టు  ఆడాను. కాని రాక్షసులు ఇంత ఘోరం చేస్తారని  కలలోకూడా ఊహించలేకపోయాను. నన్ను హీరోయిన్ గా పెట్టి, దొరికిన డబ్బుతో భారీయెత్తున సంచలనాత్మక కథా చిత్ర తీస్తారని అనుకొన్నాను." గ్లామర్ హీరోయిన్ అయిపోయినట్టూ, పెద్దపెద్ద నిర్మాతలు నా ఇంటి ముందు క్యూలో నిల్చున్నట్టే కలలు కన్నాను" ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "మాధవీ! వాళ్ళింకా ఆ ఉద్దేశ్యంతోనే వున్నారేమో! నువ్వే తొందరపడి....."
    "అంటే?"
    "నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తియ్యాలనే ఉద్దేశ్యం వాళ్ళకు ఇంకా ఉందేమో!"
    "డాక్టర్ లేదు లేదు. వాళ్ళు  సినిమాతీస్తే తీయొచ్చు కానీ నా శవాన్ని పాతిపెట్టాకే వాళ్ళు ఆపని మొదలుపెడ్తారు."
    "అని నువ్వూహించుకుంటున్నావేమో?"
    "మీరు....మీరు నన్ను ఆ దుర్మార్గులకు అప్పగించాలనుకుంటున్నారా?"
    "ఛ!ఛ! అలా ఎప్పటికీ చెయ్యను. అలా అయితే నిన్ను ఇక్కడి కెందుకు  తీసుకొస్తాను? ఇంత జరిగినా" నీకు సినిమామీద మోజు పోయినట్టులేదు. అందుకని.....ఆగి ఆమె ముఖంలోకి చూశాడు  ఉదయ్ చంద్ర.
    "లేదు డాక్టర్ లేదు. ఇప్పుడు  నాకు అలాంటి భ్రమలు లేవు. వాళ్ళ చేతుల్లోపడి దారుణమైన చావు  చచ్చేకంటే, ఇంత విషంమింగి చావడం సుఖం. గుప్పెడు నిద్రమాత్రలు ఇవ్వండి. ఇప్పుడే, మీ కళ్ళముందే మింగి హాయిగా చచ్చిపోతాను.
    "ఇంకా నయం. నాచేతుల్లో, నా ఒడిలో తలపెట్టి చచ్చిపోతానన్నావుకాదు. నువ్వు ఇంకా అలా మాట్లాడితే, ఇప్పుడే తీసుకెళ్ళి వాళ్ళ కప్పగిస్తాను.  రాంబాబుకూ, వీరభద్రుడికీ అప్పగిస్తాను తెలిసిందా?"
    మాధవి  ముందుకువంగి డాక్టర్ ఉదయ్ చంద్ర రెండు చేతులూ పట్టుకొని "మీరు కావాలంటే నా గొంతు పిసికి చంపేయండి. కాని ఆ తోడేళ్ళకు మాత్రం నన్ను అప్పగించకండి. ప్లీజ్! నన్ను  చంపేయండి, నన్ను....." వెక్కి వెక్కి  ఏడుస్తూ అన్నది మాధవి.
    "మాధవీ టేకిట్ ఈజీ, తమాషాకు అన్నాను. రిలాక్స్ ! నన్ను  అంత దుర్మార్గుడనుకొన్నావా? మూడునెలలు నాతో పరియం వుంది. మూడు రాత్రిళ్ళు నాతో కలిసి  ఉన్నావు . నువ్వు నన్ను అర్థంచేసుకొన్నది ఇంతేనా?" మాధవి  భుజంతడుతూ బుజ్జగించాడు ఉదయ్.
    మాధవి  కళ్ళుతుడుచుకొని, వెక్కిళ్ళు దిగమింగి కనురెప్పలాడిస్తూ, ఉదయ్ ను నిండుగా చూసింది.
    "ఏం తమాషాబాబూ? ప్రాణం కడబట్టిపోతూంటే మీకు తమాషాగా వుందా?"
    "అయితే, తోటలో ఆ మూడు  రాత్రిళ్ళు జరిగిన ఆ భయంకర, భీభత్స . దారుణ సంఘటనలను ఎలా తట్టుకున్నావ్ మరి?"
    "అదంతా  నాటకం. నాది ఒఠి నతనేగా? మీకు ఏ ప్రమాదమూ జరగదని నాకు తెలుసు. ఆ కండిషన్ మీదే నేను నటించడానికి అంగీకారించాను. వాళ్ళకు కావాల్సిందల్లా మీ నుంచి ఆ నగలపెట్టె రహస్యం తెలుసుకోవడమేనని నేను వాళ్ళకు  బాగా తెలుసు. అందుకే వాళ్ళు మీకే రకమైన ప్రాణహాని తల పెట్టలేదు. ఆ రాత్రి మెట్లదగ్గర మీ తలమీద  కొట్టి మిమ్మల్ని, వివశుడ్ని చెయ్యాలని తలపెట్టినప్పుడు నేను వ్యతిరేకించాను. శివరామయ్య, రాంబాబూ నన్ను  బతిమాలి ఒప్పించారు. మీరు కోరకరాని కొయ్య అయ్యారు. ఆరు నెలలు కష్టపడి ఆ పథకంవేసి, ఇంతచేసినా మిమ్మల్ని, మీ మనసునీ లొంగదీసుకోలేక పోయామని. వాళ్ళతోపాటు నేనూ నిరాశచెందాను. నా కలలూ, నా ఆశలూ, అడుగంటిపోతాయనే భయంతోనే అందుకు అంగీకరించాను. మీకు పెద్దగా గాయం తగలకుండా, స్పృహ తప్పేలా చేస్తామని  అంటేనే ఒప్పుకున్నాను. నా మాట నమ్మండి ప్లీజ్. నమ్మండి. డాక్టర్" దీనంగా  చూసింది మాధవి.
    దీర్ఘంగా నిట్టూర్చి తల  ఊపాడు డాక్టర్ ఉదయ్ చంద్ర.
    "ఓ.కే మాధవీ! నిన్ను  పూర్తిగా నమ్ముతున్నాను. నువ్వు ఏ వ్యామోహంతో వుండి  వాళ్ళ  ఉచ్చులో పడిపోయావో  అర్థంచేసుకోగలను. నీ భవిష్యత్తు  తారాపథంలో ఎగరకుండానే కిందపడిపోయిందని గుర్తించావా?"
    "ఆఁ" కళ్ళుతుడుచుకుందామె.
    "ఇప్పుడేం చెయ్యదల్చుకున్నావ్?"
    "ముందా హంతకుల బారినుండి  బయటపడినీండి."
    "అది నేనుచూసుకుంటాను. తర్వాత ఏంచెయ్యాలనుకుంటున్నావ్? మళ్ళీ నన్ను సినిమాఛాన్సు  కోసం ప్రయత్నం చేయవా?"
    "ఏం మీరు తీస్తారా?" పకపక నవ్వింది.
    "తీస్తే  హీరోయిన్ గా...."
    "మీరు గీరోగా వేస్తే....."కొంటెగా చూసింది.
    ఉదయ్ కు నవ్వాగలేదు. బిగ్గరగా నవ్వేశాడు. మాధవి హాయిగా  నవ్వింది.
    కొద్దిక్షణాలు అతడు కన్నార్పకుండా ఆమెను చూస్తూ  వుండి పోయాడు.
    "ఊఁ! ఏం చెయ్యదలుచుకొన్నావ్?"
    "అతని గొంతు  కొత్తగా  విన్పించింది ఆమెకు.
    ఆ గొంతులో ఆమెకు  ఏదో  తీవ్రతా, సంకల్పమూ స్ఫురించాయి.
    ఆమె ముఖంలో వచ్చిన మార్పును అతడు గుర్తించాడు.
    ఆమె కళ్ళల్లోని అల్లరితనమూ, పెదవులమీద చిందులాడుతున్న చిలిపితనమూ, ఒక్కసారిగా మాయమైనాయి. చూపులు నిశ్చలంగా వున్నాయి. ముఖంలో  వచ్చిన మార్పు ఏదో స్థిర సంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నది.
    "మీకు అభ్యంతరం లేకపోతే....."
    "ఆగావేం? ఊఁ చెప్పూ?"
    "మీరు అనుమతిస్తే నర్సు  ట్రైనింగ్ అయి ప్రశాంత నర్సింగ్  హొమ్ లో నర్సుగా  సేవ చెయ్యాలని వుంది.
    ఉదయ్ చివ్వున తలెత్తి  ఆశ్చర్యంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లోని ఆర్ధ్రత, ఆ ముఖంలో కన్పించిన నిజాయితీ, అతడి హృదయాన్ని కదిలించి వేశాయి.
    "మాట్లాడరేం? మీ కిష్టంలేదా?" ఆమె  గొంతు జీరపోయింది.
    "నో!నో! నువ్వు  నర్సుగా చేర్తావా?" ఎక్కడో  ఏదో  ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు.
    "ఎం నే నందుకు పనికిరానా? లేక  నామీద విశ్వాసం  లేదా?" మాధవి  గొంతు ఈసారి తీవ్రంగానే వుంది.
    "నీ నిజాయితీ  మీదగానీ, నీ సామర్థ్యంమీదగానీ నీకెలాంటి అప నమ్మకంలేదు. కానీ...."
    "మరి ఏమిటి మీ సందేహం? చెప్పండి. నామీద నమ్మకంలేకపోతే చెప్పండి. మీ మనసులో వున్నదేదో చెప్పండి. మాట్లాడరేం? ఎందుకా మౌనం?"
    నిన్ను నర్సుగా ఊహించుకుంటున్నాను." అతడి కళ్ళు తళుక్కుమన్నాయి.
    "అసహ్యంగా ఉన్నానా?"
    "కాదు దివినుండి దిగి వచ్చిన దేవతలా వున్నావు. ఆకాశంలో విహరిస్తున్న ఫెయిరీటెల్ లోని ఏంజల్ లావున్నావు. శ్వేతాంబరధారివై...."
    "అమ్మో డాక్టర్ గారు కవిత్వం అల్లేస్తున్నారు. మీ పొగడ్తలు నాకేం  అవసరంలేదు. నన్ను నర్సుగా అంగీకరిస్తున్నారా లేదా? తేల్చి చెప్పండి. నేను కోరుకుంటున్నది మీ దగ్గర నర్సుగా పనిచేయ్యడమే...."
    "అంతకుమించి నువ్వేమీ....."
    "అంతకుమించి కోరుకొనే అర్హత నాకు లేదని తెలుసు నాకు డాక్టర్ గారూ!"
    "నీ అర్హతలేమిటో నిర్ణయించాల్సింది నేను. నువ్వు నర్సుగా పనికివస్తావో లేడి డాక్టర్ గా తెల్చవలసింది నేను మనసున్న  మనిషిగా. ఇంకా నీ అర్హతలు ఏనో నిర్ణయించే హక్కు నాకిస్తారా మానసీ.....సారీ_మాధవిగారూ!"
    ఉదయ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల్లో ఆమె కరిగిపోయింది.
    "ఉదయ్.డి. యస్. పి. విల్సన్ రావే  స్వయంగా వస్తున్నాడు." అంటూ జయంత్ రావు లోపలికొచ్చాడు.
    "విల్సన్  రావా? కానిస్టేబుల్స్ ని కదా పంపమన్నావు?"
    "విల్సన్ రావు గురించి నీకు బాగా తెలియదనుకుంటాను. వివరాలన్నీ  చెప్పేదాకా ఫోన్  వదల్లేదు. వాళ్ళను ఈ రాత్రికి రాత్రే  పట్టేస్తానంటున్నాడు. ఈ మధ్య రెండు మర్డర్ కేసుల్లో-ముఖ్యంగా ఎం.ఎల్.ఏ. హత్యకేసులో అనుమానితుల ఆచూకి దొరక్క తన్నుకొంటున్నాడు. హొంమినిష్టర్ ఫోన్లమీద వాయించేస్తున్నాడట. అతడ్ని ఇక్కడ్నుంచి బదిలీచేసే ఆలోచన వున్నదని అందోళనగా వున్నాడు. అందుకే ఈ కేసులోనన్నా హంతకుల్ని పట్టుకోవలని స్వయంగా వస్తున్నాడు."
    "పోలీసులు రంగంలోకి దిగారని పసిగట్తే రాంబాబూ, వీరభద్రుడూ క్షణాలమీద తప్పుకొంటారు. రాంబాబు గురించి విల్సన్ రావుకు తెలియదు." సాలోచనగా అన్నాడు ఉదయ్.
    "అవును. రాంబాబు మనుషుల్నే మాయం చేస్తాడు. తనుమాయం గావడం ఎంతపని? మెజిషియన్ అందులోనూ క్షుద్ర విద్యలను ప్రాక్ష్టీసుచేస్తాడు. అతడికి కలకత్తాలోనే కాదు  ఇక్కడకూడా చాలా పరపతివుంది. రాంబాబుకు ఈ రాష్ట్రంలో కొంతమంది ఐ.ఏ.యస్. ఆఫీసర్లు తోనూ, రచయితలతోనూ, మంత్రులతోనూ, సారా వ్యాపారస్తులతోనూ సంబందాలున్నాయి. అతడ్ని  బంధించాలంటే ఎంతో సాహసం, ధైర్యం కావాలి. పైనుంచి వచ్చే  వత్తిళ్ళను తట్టుకొనే ఆత్మస్థయిర్యం వుండాలి. డాక్టర్ జయంత్ రావు గారూ, మీ విల్సన్ రావు గుండెనిబ్బరం ఉన్నావడేనా?"
    జయంత్ రావూ, ఉదయ్, మాధవిని ఆశ్చర్యంగా చూశారు. మాధవి ఇంత తెలివిగా, నిశితంగా మాట్లడగలదని జయంత్ ఊహించలేదు. ఆమె గురించిన తన అంచనాలు తప్పు అని గ్రహించాడు.
    "మిస్  మాధవీ! కొద్దిసేపట్లో విల్సన్ రావే వస్తున్నాడుగా? అతడికి ఆ సామర్థ్యం వుందో లేదో అతడ్ని చూశాక మీరే  నిర్ణయించుకోండి! విల్సన్ రావు...."జీపు ఆగిన చప్పుడూ, గేటు తెరిచిన మోతా, సిమెంటు మెట్లమీద బూట్లు చేస్తున్న చప్పుడు విని, ఆగిపోయాడు  జయంత్ రావు.
    లేచివెళ్ళి లోపలకోస్తున్న విల్సన్ రావును ఆహ్వానించాడు.
    "హల్లో డాక్టర్! వేరీజ్ షీ? ఆవిడెక్కడా?" వస్తూనే అడిగాడు విల్సన్ రావు.
    "కమాన్ కమిన్! మిస్టర్ విల్సన్ !" అంటూ డాక్టర్ జయంతరావు, విల్సన్  ను, ఉదయ్ చంద్ర, మాధవి  వున్న గదిలోకి తీసుకొచ్చాడు.
    "గుడ్  యీవెనింగ్ మిస్టర్ విల్సన్ రావు?" ఉదయ్  లేచి కరచాలనం చేశాడు.
    "నమస్తే" మాధవి లేచి నిలబడింది.
    "ఓ? యూ ఆర్  ద ఉమెన్ బి హైండ్ ద స్టోరీ!" నొసలు ముడిచి నోరంతా తెరిచాడు విల్సన్ రావు గారపట్టిన పెద్ద పెద్ద పళ్ళవరసచూస్తూనే మాధవి వళ్ళు జలదరించింది.
    "యస్. యస్.మిస్టర్ విల్సన్. ఈమె ఈ హీరోయిన్ మనసి పాత్ర ధారిణి మిస్ మాధవి" అని పరిచయం చేస్తున్న జయంత్ వంక తీక్షణంగా చూశాడు డాక్టర్ ఉదయ్ చంద్ర.
    తను అలా ఆమెకు పరిచయం చెయ్యడం  ఉఅదాయ్ కు  నచ్చలేదని గ్రహించి సర్దుకొన్నాడు జయంత్ రావు.
    "ఓ.కే. మిస్టర్ విల్సన్ . మిస్  మాధవిని మా ఇంటి దగ్గిర దించి, మీ వాళ్ళను  ఇద్దర్ని గార్డుపెట్టి మనం వాళ్ళకోసం టౌన్ మొత్తంగాలిద్దాం. ఉదయ్ చంద్ర వాళ్ళను గుర్తుపట్టగలడు. ఏమంటారు మిస్టర్  విల్సన్" అన్నాడు జయంత్ రావు.
    "నో!నో! ఐ మూవ్  మై  ప్లాన్ టు క్యాచ్  మర్డరర్స్ . ఆపరేషన్, నోమూన్" భుజాలేగరేశాడు డి. యస్. పి. విల్సన్ రావు.
    జయంత్, ఉదయ్, అతడికేసి అయోమయంగా చూశారు.
    "మై ప్లాన్ ఈజ్  వెరీసింపుల్. నా పథకం ఆపరేషన్ అమావాస్య!"
    జయంత్ నుదురు రుద్దుకుంటూ విల్సన్ రావును చూశాడు.
    డాక్టర్ ఉదయ్  చిరాకు పడినా, అది ముఖంలో కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు.
    "డాక్టర్ జయంత్! పులిని ఎట్లావేటాడుతాం?" అడుగుముందుకు వేసి, జయంత్ ముఖంలో ముఖంపెట్టి  అడిగాడు.
    "మీరే చెప్పాలి?డాక్టర్ జయంత్ వెనక్కు జరుగుతూ అన్నాడు.
    "పిలికి మేకను మాటువెయ్యాలి. మేకను తినడానికి వచ్చిన పులిని బంధించాలి."
    "అంటే?"
    ఉదయ్, జయంత్ ఒక్కసారే అప్రయత్నంగా అనేశారు.
    "ఆ!! వినండి. చూడు బుల్లెమ్మా! నీ పేరేమిటన్నావు? మందాకినా?"
    "కాదు. మాధవి" అన్నాడు జయంత్.
    "ఆఁ ఆఁ మాధవి! ఆ అమ్మాయికోసమేకదా వాళ్ళు వెదుకుతున్నారు? అందుకే ఈమెను ఎరగా  వెద్దాం. ఎలా ఉంది మన ఆపరేషన్  అమావాస్య ?" పక్కలు ఎగిరెట్టు నవ్వాడు విల్సన్ రావు.
    'ఏడిసినట్టుంది.' లోలోపల అనుకొన్నాడు జయంత్.
    మాధవి  లేడిపిల్లలా భయంభయంగా చూసింది.
    "మీరు పులిని బంధించేలోపల మేకను  పులి తినేస్తే?"
    "డాక్టర్ ఉదయ్ చంద్ర! మీ ఉద్దేశ్యం ఏమిటి? మమ్మల్నంత తెలివితక్కువ దద్దమ్మలనుకొంటున్నారా? షూట్ యట్ సైట్! పులిని ప్రాణంతో పట్టుకోలేకపోతే కాల్చిపారేస్తాను. ఏ పరిస్థితుల్లోనూ ఈ బుల్లెమ్మకు అదే మాధవికి ఎలాంటి అపకారం జరక్కుండా చూసే బాధ్యత నాది. 'ఆపరేషన్  అమావాస్య'కు అప్పుడే పథకం తయారుచేసివచ్చాను. ఓక యస్సైనూ, ఇద్దరు కానిస్టేబుల్స్ నూ బస్ స్టాండు  దగ్గర పెట్టాను.వాళ్ళు మాప్టీలో వుంటారు.   

 Previous Page Next Page