Read more!
 Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 2

 

కోడలు ఎం టెక్ చేసింది. 
మధు కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది. 
నాకు ఒక్కడే కొడుకు. 
వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 
ఇంకా పెళ్లి కాలేదు.  
సాయంత్రం నిన్ను కలవాలిరా అన్నాడు మధు. 
సరే అని చెప్పాను.
తరువాత వాడే చెప్పాడు కొంచెం కంగారు స్వరంతో. 
నిన్న రాత్రి సంజయ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. 
సంజయ్ అంటే మధు కొడుకు. 
మూడు నెలల క్రితం పెళ్లి చేసుకుని అమ్మాయిని అమెరికా తీసుకు వెళ్ళాడు. 
ఆ అమ్మాయి పేరు మంజరి. 
విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎం టెక్ చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంది. మాట్రిమోనీ ద్వారా మధు ఆ సంబంధం చూసాడు. 
మంజరి వాళ్ళ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీ లో మేనేజర్ గా ఉన్నాడు. 
తల్లి ఇంజనీరింగ్ కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా వర్క్ చేస్తోంది. 
వాళ్లకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు.    
మంజరి వాళ్ల చిన్న కూతురు. 
అందంగా ఉంటుంది. 
మంజరిని చూసేందుకు మధు, వాడి భార్య ప్రవల్లిక ఒకరోజు విజయవాడ వెళ్లారు. 
అమ్మాయి ఇద్దరికీ నచ్చింది. 
అందం చదువు అన్నీ ఉన్నాయి. 
ఫామిలీ బాక్గ్రౌండ్ నచ్చింది. 
మధుకి కట్న కానుకలు అవసరంలేదు. 
సో అలా ముందుకు సాగింది ఆ సంబంధం. 
తరువాత స్కైప్ ద్వారా సంజయ్ కి మంజరి కి పెళ్లి చూపులు జరిగాయి. 
 పెళ్లి సంబంధం కుదుర్చుకునేప్పుడు నేను నా భార్య వెళ్ళాము. 
మధు ఇంట్లో నే పెళ్లి మాటలు జరిగాయి.  
మంజరి తండ్రి ముకుందరావు, తల్లి వాణి, వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారు ఆరోజు.  
మధు ఖరాఖండిగా చెప్పాడు కట్న కానుకలు ఏమీ వద్దని, పెళ్లి కూడా సింపుల్ గా చెయ్యమని.   
మధుకు ఆ సంబంధం కుదరడం సంతోషంగా అనిపించింది. 
సంజయ్ కూడా క్రమశిక్షణగల అబ్బాయి. 
చదువులో ఫస్ట్, నడవడికలో బెస్ట్ గా ఉంటాడు. 
తల్లి తండ్రుల మాట జవదాటడు.
ఎంగేజ్మెంట్ కూడా మధు ఖర్చులతోనే హోటల్లో వైభవంగా చేసాడు. 
మంజరి తండ్రి ముకుంద రావు ఎంగేజ్మెంట్ మీరే చెయ్యాలి అది సంప్రదాయం అని చెప్పాడు. 
అందుకు కాదనలేదు మధు. 
పెద్ద హోటల్లో అందరిని పిలిచి బాగా చేసాడు. 
పెళ్లి కొడుకు సంజయ్ బిజీ గా ఉన్నందున ఎంగజ్మెంట్కు రాలేదు. 
ఆరోజు కూడా స్కైప్ లో సంజయ్ కనిపించాడు. 
ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. 
మధు మోహంలో నాకు ఆనందం కనిపించి నేను చాలా హాపీగా ఫీల్ అయ్యాను. మధు వాడి భార్య కూడా చాలా నెమ్మదస్తులు. 
హ్యాపీ గో టైపు గా ఉంటారు. 
అలాంటి మధు కంగారు గా ఉన్నాడు అంటే నాకు చాలా డౌట్స్ వచ్చాయి. 
ఏదో జరిగుంటుంది అని సందేహాలు తలెత్తాయి. 
వాడి కంగారు నాలో కూడా ప్రవేశించింది. 
మధు మామూలుగా కంగారు పడే మనిషి కాదు. 
అలాంటివాడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఎదో గట్టి విషయమే ఉందనిపించింది. 
ఏంటి ? అంతా కులాసానే కదా ? సంజయ్ ఎలా ఉన్నాడు. 
కొత్త కాపురం బాగానే ఉంది కదా  అడిగాను మధుని, వాడి కంగారుని చూసి.
లేదురా ?  చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు సంజయ్. నీతో మాట్లాడాలి. కొంత అర్జెంటు కూడా. సాయంత్రం కలుద్దామా అన్నాడు.
సరే. మా ఇంటికిరా. ఆరుకల్లా వచ్చేయి. నేను ఇంటికి వచ్చేస్తాను. ఇవాళ క్లైంట్స్ మా జూనియర్స్ కి అప్పచెప్తాను. ఓకే నా అన్నాను. 
థాంక్స్రా. చాలా అర్జెంటు. వాడి స్వరంలో ఇంకా కంగారు తగ్గలేదు. 
నువ్వు కంగారు పడకురా. నేనున్నాగా. అని ధైర్యం చెప్పాను. 
****
కోర్ట్ లో ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. 
అయినా మధుకి ఆరు గంటలకొస్తానని చెప్పాను. 
జూనియర్స్ కి వర్క్ అప్పచెప్పి ఇంటికి బయలు దేరాను. 
మామూలు రోజుల్లో అయితే ఇంటికి చేరేసరికి ఏడు పైనే అవుతుంది. 
కోర్టులో పెండింగ్ ఆర్డర్స్, తీర్పు కాపీలు తీసుకుని కానీ బయలుదేరను. ఈరోజు ఆ వర్క్ మా వాళ్ళకే అప్పచెప్పి త్వరగా బయలుదేరాను. 
ట్రాఫిక్ ఆ సమయంలో బాగా రద్దీగా ఉంటుంది మా రూట్లో. 
ఇంటికి చేరేసరికి ఆరు గంటలైంది. 
మధు హాల్ లో కూర్చుని మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతున్నాడు. 
నన్ను చూడగానే వాడి ముఖం వికసించింది. 
ఏదో చెప్పాలని అప్పటివరకు ఉగ్గబట్టుకున్నట్టు టెన్షన్గా కూర్చోనున్నాడు.
ఒక్క పది నిమిషాలురా ! ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని డ్రెస్ మార్చుకుని, గబ గబా ముఖం కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ వాడి పక్కన వచ్చి కూర్చున్నాను.
ఇప్పుడు చెప్పరా. ఏంటి సంగతి సంజయ్ గురించి. అంతా ఓకే నా !
లేదురా. 
చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. 
నిన్న అర్ధ రాత్రి ఫోన్ చేసాడు. 
వాడి భార్య మంజరికి వేరే అబ్బాయి తో ప్రేమ వ్యవహారం ఉందట కాలేజీ రోజుల నుంచి. 
వాడి కోసమే ఉద్యోగంలో కూడా చేరకుండా ఎం టెక్ అదే కాలేజీ లో చదివింది. 
తల్లి తండ్రులకు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసు. 
అందులోను మంజరి వాళ్ళ కాలేజీలోనే వాళ్ళ అమ్మ కూడా లెక్చరర్ గా పని చేస్తోంది.   
తల్లి తండ్రులతో కూడా చెప్పిందట వాడినే చేసుకుంటానని. 
పేరెంట్స్ కు వాడు నచ్చలేదు. 
ఎందుకంటే అతనిది వేరే కులం. 
కూతురికి నచ్చ చెప్పి ఈ పెళ్లి చేస్తే కొన్ని రోజులకి దారిలోకి వస్తుంది అని ఇవేమి మనకు చెప్పకుండా పెళ్లి చేశారు. 
స్కైప్ లో మాట్లాడేప్పుడు కూడా ఆ అమ్మాయి వెనకే పేరెంట్స్ ఉండేవాళ్ళంట మానిటరింగ్ చేస్తూ. 
నిన్న రాత్రి సంజయ్ చెప్తున్నాడు. 
మరి పెళ్ళై మూడు నెలలయిందిగా. 
సంజయ్ కి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ?
మంజరి పెద్ద ప్లాన్ వేసిందిరా. 
తల్లి తండ్రుల బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది. 
వాళ్ళ మీద కసి తీర్చుకుందామని అనుకుంది. 
అందుకే పెద్ద డ్రామా ఆడింది. 
సంజయ్ తో ఆరు నెలలు కాపురం చేసి వాడి డబ్బులు, ఇంకా ఏమైనా ఉంటె తీసుకుని ఇండియాకి వచ్చేద్దామనుకుంది. 
రోజూ ప్రియుడితో ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడేది సంజయ్ ఆఫీస్ కి వెళ్ళగానే. 
ఫేస్ బుక్ మెసెంజర్ అయితే ఎవరు కనిపెట్టలేరుగా అందుకని. 
వీడికి ఇవన్నీ తెలిసేవి కాదు. 
నిన్న సంజయ్ కి బాగా తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. తనని డిస్టర్బ్ ఎందుకులే చెయ్యడమని డూప్లికేట్ కీ తో మెయిన్ డోర్ తీసి లోపలి కెళ్ళాడు.  
ఇవేమి గమనించని మంజరి తన లోకంలో తాను ప్రియుడితో  ఫేస్ బుక్ మెసెంజర్ లో బట్టలన్నీ విప్పేసి వీడియో కాల్ లో మాట్లాడుతోందట.  
సంజయ్ కి ఒక్క సారి మతి పోయి ఎవరైఉంటారా అని డోర్ పక్కన వెయిట్ చేసాడట. 
వర్ణించలేని భాషలో ఇద్దరూ సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నారట. 
మా వాడికి పట్టరాని కోపం వచ్చి విసురుగా వెళ్లి తన చేతిలోని మొబైల్ లాక్కొని ఒక్క మారు స్క్రోల్ చేసాడట. 
వీడి అదృష్టం కొద్దీ మెయిల్ మరియు ఫేస్బుక్ లాగిన్స్, పాసువర్డ్స్ దొరికాయట. ఇమ్మీడియేట్ గా వాడి లాప్ టాప్ ఓపెన్ చేసి వాటి పాసువర్డ్స్ అన్నీ మార్చేసి వీడి కంట్రోల్ కి తెచ్చుకున్నాడట. 
తన బండారం బట్టబయలయ్యేసరికి మంజరికి ఏంచెయ్యాలో  తోచక వంటింట్లోకెళ్ళి కత్తితో ముంజేతి మీద కోసుకుంటానని, పోలీస్ కంట్రోల్ కి ఫోన్ చేస్తానని బెదిరించిందట.
అందులో అమెరికాలో పోలీస్ కేసు అంటే చాలా సీరియస్ గాఉంటుంది రా .  నీకు తెలుసుగా అన్నాడు మధు.   
సంజయ్ ఒక్క క్షణం అలోచించి మంజరినే అడిగాడు. 
నువ్వే చెప్పు ఏంచేద్దాం అని. 
తన డిమాండ్ ఏంటంటే ముందు ఇండియాకి పంపమని. ఈవిషయాలేవీ ఎవ్వరికీ చెప్పొద్దని.   
ఒక నెల తరువాత ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తానే  చెప్తుందట. 
వీడు సరే అని ఒప్పుకున్నాడు గత్యంతరంలేక.
ఇప్పుడెలా లీగల్గా ప్రొసీడ్ అవడం ? నువ్వే చెప్పాలి ఎదో ఒక ఉపాయం. 
వాడు నిద్ర లేక టెన్షన్గా ఉన్నాడు ఎలా చెయ్యాలా అని. కంగారుగా అన్నాడు మధు. 
వాడి గాబరా చూసి వాడి చెయ్యి మీద నా చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కి భరోసా ఇచ్చాను ఏం ఫరవాలేదన్నట్లు.
అప్పుడు రాత్రి ఏడయ్యింది. 
 

 

 Previous Page Next Page