Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 3

 

    "గొడవెందుకూ అనుకుంటే చెడిపోవు...." అన్నాడతడు.
    "నువ్వు చెప్పదల్చుకున్న దేంటో సూటిగా చెప్పు...." అంది జ్యోత్స్న.
    "అలా కూర్చో ---తాపీగా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం.....' అన్నాడతడు.
    ఇద్దరూ ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు.
    "నాకు కొన్ని కాగితాలు కావాలి. అవి నీ భర్త తెచ్చివ్వాలి. అతడిచ్చాడూ -- సరేసరి , లేదా నువ్వు చెడిపోతావు--" అన్నాడతడు.
    "ఏమిటా కాగితాలు?" అంది జ్యోత్స్న.
    "ఆవి నీ భర్తకు వివరంగా చెప్పుకుంటాను...."
    జ్యోత్స్న ధైర్యం చేసి -- "అలాంటప్పుడు నన్ను చెడగొట్టడం గురించి ఆయనకే చెప్పవలసింది,...." అంది.
    "నిన్ను చెడగొడతానన్న బెదిరింపు నీకోసమనుకున్నావెంటి -- అది నీ భర్త కోసమే!" అన్నడతను.
    "మరి అయన సాయంత్రం ఆరింటిదాకారారు. నువ్వూ అప్పుడే రావాల్సింది...."అంది జ్యోత్స్న.
    "అదీ నిజమే! కానీ ఈలోగా నిన్ను కాసేపూ బెదిరించవచ్చు కదా అని--" అన్నాడతను.
    "నేనంత సులభంగా దేనికీ బెదరను --" అంది జ్యోత్స్న బింకంగా.
    "కానీ నువ్వు నీ భర్తకు చెప్పి మా కాగితాలు రప్పించాలి. అవి చాలా అవసరం...."
    'ఆయన్ను నువ్వే అడుగు...."
    "అడుగుతాను కానీ నీ సిఫారసు కూడా వుంటే మంచిదని...."
    "నేను సిఫారసు చెయ్యకపోతే....'
    'అంటే?" అంది "గొడవెందుకూ అనుకుంటే చెడిపోవు...." అన్నాడతడు.
    "నువ్వు చెప్పదల్చుకున్న దేంటో సూటిగా చెప్పు...." అంది జ్యోత్స్న.
    "అలా కూర్చో ---తాపీగా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం.....' అన్నాడతడు.
    ఇద్దరూ ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు.
    "నాకు కొన్ని కాగితాలు కావాలి. అవి నీ భర్త తెచ్చివ్వాలి. అతడిచ్చాడూ -- సరేసరి , లేదా నువ్వు చెడిపోతావు--" అన్నాడతడు.
    "ఏమిటా కాగితాలు?" అంది జ్యోత్స్న.
    "ఆవి నీ భర్తకు వివరంగా చెప్పుకుంటాను...."
    జ్యోత్స్న ధైర్యం చేసి -- "అలాంటప్పుడు నన్ను చెడగొట్టడం గురించి ఆయనకే చెప్పవలసింది,...." అంది.
    "నిన్ను చెడగొడతానన్న బెదిరింపు నీకోసమనుకున్నావెంటి -- అది నీ భర్త కోసమే!" అన్నడతను.
    "మరి అయన సాయంత్రం ఆరింటిదాకారారు. నువ్వూ అప్పుడే రావాల్సింది...."అంది జ్యోత్స్న.
    "అదీ నిజమే! కానీ ఈలోగా నిన్ను కాసేపూ బెదిరించవచ్చు కదా అని--" అన్నాడతను.
    "నేనంత సులభంగా దేనికీ బెదరను --" అంది జ్యోత్స్న బింకంగా.
    "కానీ నువ్వు నీ భర్తకు చెప్పి మా కాగితాలు రప్పించాలి. అవి చాలా అవసరం...."
    'ఆయన్ను నువ్వే అడుగు...."
    "అడుగుతాను కానీ నీ సిఫారసు కూడా వుంటే మంచిదని...."
    "నేను సిఫారసు చెయ్యకపోతే...."
    "అప్పుడు రేపు కూడా నీ పిల్లలింటికి రారు...."
    "అంటే?" అంది జ్యోత్స్న తెల్లబోయి.
    "ఈరోజుకు వాళ్ళింటికి రారు...."
    "ఎందుకని?"
    "ప్రస్తుతం వాళ్ళు మా సంరక్షణలో వున్నారు. ,మా కాగితాలు మాకందితే వాళ్ళకే ప్రమాదం లేదు. అందక పొతే -- నీకోసం నీ పిల్లలు వికలాంగులౌతారు. నీ భర్త కోసం నీ మానం చెడుతుంది...." అన్నాడతను.
    "ఎవరు నువ్వు?"    
    "నా పేరు పాండురంగ విఠల్...." అన్నాడతను.
    "ఏమిటా కాగితాలు?"
    "మళ్ళీ మొదటి కొచ్చావు. నువ్వు నీ భర్త గురించీ, నీ గురించి, నీ పిల్లల గురించీ ఆలోచించుకో, కాగితాల గురించి నీ భర్త ఆలోచిస్తాడు...."
    "వచ్చిన పనింతేనా....వెళ్ళు...." అందామె.
    'ఇప్పుడు వెడతాను. సాయంత్రానికి వస్తాను...." అంటూ అతడు బయటకు వెళ్ళాడు. తలుపులతడు బైట నుంచి గడ పెట్టాడు.
    జ్యోత్స్న గబగబా పక్కింటి తలుపు తట్టింది. ఒక్క క్షణంలో సుకుమార్ తలుపు తెరిచాడు. ఆమెను చూడగానే అతడేదో చెప్పాలనుకున్నాడు.
    "మిస్టర్ సుకుమార్! అర్జంటుగా నాకు నీ సాయం కావాలి. ఇప్పుడే మా యింట్లోంచి ఓ మనిషి బయటకు వెళ్ళాడు. వెడుతూ వెడుతూ ఇంటి తలుపు బైట నుంచి గెడ వేశాడు. అతడు ముక్కు పొడెం రంగు పాంటు మీద పొట్టి చేతుల ఎర్ర గళ్ళ చొక్కా ఇన్ షర్ట్ చేశాడు. నీకంటే రెండంగుళాల తక్కువే ఉంటాడు. పొడుగు, నువ్వతడి ఆచూకీ తీసి వివరాలు నాకు చెప్పగలిగితే-- నువ్వేం కోరితే అదిస్తాను. నీకు, ప్లీజ్ -- వెంటనే బయల్దేరూ?' అందామె చనువుగా.
    ఆమె అలా చనువుగా మాట్లాడేసరికి సుకుమార్ ఛాతీ ఉబ్బింది. ఆమె తనను నువ్వంటుంటే మధురంగా అనిపించింది.
    "ఇంతకీ అతడెవరు?" అన్నాడతడు.
    "నా పెర్సనాలిటీకీ ప్రమాదకరమైన వ్యక్తీ. నీ పెర్సనాలిటీకి కాదు...." అంది జ్యోత్స్న.
    సుకుమార్ వెంటనే అక్కణ్ణించి కదిలాడు. తనేం చేయబోతున్నాడో అతడికి తెలియదు. తనేం కోరబోతున్నాడో ఆతడికి తెలుసు.

                                    3
    పాండురంగ విఠల్ పేరుతొ జ్యోత్స్న ఇంటి నుంచి బయటపడిన వ్యక్తీ సందు చివరి వరకూ వెళ్ళేసరికి -- సందులోకి అతడి వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులతడిని పరుగున సమీపించి -- "యా యింట్లోంచే ఓ కుర్రాడు బయటకు వచ్చాడు. అతడు నిన్ననుసరిస్తున్నాడని అనుమానంగా వుంది...." అన్నారు.
    అతడు వారితో మాట్లాడుతున్నట్లుగా వెనక్కు చూశాడు.
    హడావుడిగా ముందుకు వస్తున్న సుకుమార్ అతడికి కనిపించాడు. సుకుమార్ ఇంకా చాలా దూరంలో  వున్నాడు - సన్నటి ఆ పొడవాటి సందులో!
    "సరే-- మీరు వెళ్ళండి -" అన్నాడు  విఠల్. వాళ్ళు వెళ్ళిపోయారు.  విఠల్ చటుక్కున వెనక్కు తిరిగాడు.
    అతడిప్పుడు సుకుమార్ కి ఎదురుగా వస్తున్నాడు.
    ఇద్దరూ ఒకరికొకరు ఎదురయ్యారు.
    సుకుమార్  విఠల్ ని గుర్తుపట్టాడు. ఆమె వర్ణన  అతడికి అతికినట్లు సరిపోయింది.
     విఠల్ అతడిని దాటుకుని ముందుకు వెళ్ళాడు. సుకుమార్ కేం చేయాలో తోచలేదు. తను కూడా చటుక్కున వెనక్కు తిరిగాడు.
    పాండురంగ  విఠల్ చిన్నగా జగదీష్ ఇంటికి వెళ్ళి బయట పెట్టిన గడియ తీసి రోడ్డు మీదకు వచ్చాడు. సుకుమార్ అతడి వంకే ఆశ్చర్యంగా చూస్తూ -- "ఎవరు నువ్వు?' అన్నాడు.
    "నా పేరు పాండురంగ  విఠల్. నేను జ్యోత్స్న కు స్నేహితుణ్ణి ఆమెను కలుసుకొందుకు వచ్చి వెళ్ళిపోయే టప్పుడు పొరపాటున తలుపు బయట నుంచి గడియ పెట్టాను. అది గుర్తుకు వచ్చి ముందుకు వెళ్ళిన వాడిని వెనక్కు వచ్చాను--" అన్నాడతను.
    "నువ్వు అబద్దం చెబుతున్నావు?' అన్నాడు సుకుమార్.
    "ఇంతకీ నువ్వెవరు?" అన్నాడు  విఠల్.    
    "నీ ఆచూకీ తీయమని నన్ను జ్యోత్స్న పంపింది--" అన్నాడు సుకుమార్.
    "అలాగా -- అయితే నాతోరా!" అంటూ ముందడుగు వేశాడు  విఠల్.
    సుకుమార్ కొంతదూరం అతడి ననుసరించి - 'అగు-" అన్నాడు.
    "ఏం?" అన్నాడు  విఠల్.
    "జ్యోత్స్న నీ గురించి నాకింకోలా చెప్పింది. నీ విషయమేదో ఇక్కడే తేల్చుకుంటాను. నిన్ననుసరించి దూరం వెళ్ళడం నాకు ప్రమాదం ---...." అన్నాడు సుకుమార్.
     విఠల్ నవ్వాడు --"అసలు జ్యోత్స్న కూ నీకూ పరిచయమేమిటి?-- నేను బయట నుంచి తలుపు గడియ పెడితే ఆమె నిన్నెలా కలుసుకుంది?"
    సుకుమార్ యేమీ చెప్పకూడదనుకున్నాడు. కానీ  విఠల్ తెలివిగా చాలా సమాచారం రాబట్టడతడి దగ్గర్నుంచి.
    'అంటే నువ్వు దాని రంకు మొగుడి వంనమాట!"
    "ఛీ -- అలాగనకు. ఆమె అలాంటిది కాదు...."
    "మరేలాంటిది?"
    "ఆమె నాకు మంచి స్నేహితురాలు...."
    "జ్యోత్స్న ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు. దాని అక్రమ సంబంధాలకు సంబంధించిన ఫోటోలు నా దగ్గరున్నాయి. నేనిప్పుడు దాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికే వెళ్ళాను...."
    'అయితే నువ్వు బ్లాక్ మెయిలర్ వన్నమాట. నిన్ను పోలీసులకు పట్టివ్వడం నా విధి...." అన్నాడు సుకుమార్.
    "అందువల్ల జ్యోత్స్న బ్రతుకు పదిమందిలోనూ పడుతుంది..." అన్నాడు  విఠల్ నిర్భయంగా.
    "పడినా ఫరవాలేదు. అదంతా పోలీసులు చూసుకుంటారు. నిన్నిప్పుడే పోలీసుల కప్పగిస్తాను" అన్నాడు సుకుమార్.
     విఠల్ క్షణ మాలోచించి -- "పోనీ ఓ పని చేద్దాం. నువ్వు నా జోలికి రాకుండా నాకు సహకరిస్తానంటే జ్యోత్స్న ను నిజంగా నీదాన్ని చేస్తాను. అది నేనెలా చెబితే అలా వింటుంది. నేనడిగినంత డబ్బువ్వ లేదు కాబట్టి నేను చెప్పిన పనికి ఒప్పుకుంటుంది...." అన్నాడు.
    సుకుమార్ కళ్ళలో ఆశ మెరిసింది. అతడు క్రమంగా  విఠల్ చెప్పింది వినసాగాడు.

 Previous Page Next Page