Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 53
మనుమసిద్దినృపాలుఁడు సింహాసనాసినుఁడగుటయు రాజ్యమునఁ గల్లోలములు మెండగుటయు నొక్కమాటే సమకూరెను. అయన రాజ్య మప్పటికి కావలి మొదలుకొని కాంచీపురమువరకును వ్యాపించియుండెను. రాజ్యము చిన్నదియేయైనను నాలుగు దిక్కుల నుండి చెలరేగిన కల్లోలముల మూలమున మనుమసిద్దికి విశ్రాంతి లభింపకుండెను'. కాని తిక్కనృపాలుని వద్ద మహా మంత్రిగను, ప్రధాన సేనానాయకుఁడుగను నుండిన సిద్దనామాత్యుఁడే మనుమ'సిద్ది మహీపాలునకు మంత్రియై , సేనాధిపతియై కొంతకాలము రాజ్యనౌకను నెట్టుకొని వచ్చెను. ఈతఁడు కార్యఖడ్గమూలయందప్రతిమానుఁడైవన్నెకెక్కినవాఁడు.
సిద్దనామాత్యుడు మంత్రిభాస్కరుని కుమారుఁడు . మంత్రి భాస్కరునకు కొమ్మాంబయను సతీరత్నమునందు నలువురు కుమారులుద్భవించిరి. వారు వరుసగాఁ గేతన, మల్లన, సిద్దన, కొమ్మన నామధేయములచే నొప్పి చరిత్ర పసిద్ది గడించిరి. వీరి యందు సిద్దన మనుమసిద్దియోద్దను, అయన జనకుఁడగు తిక్కనృపాలుని యోద్దనుమహామంత్రియై యశస్సు సంపాదించినాఁడు. చిన్నావాఁదిన కొమ్మనయు గుంటూరుపట్టణమునకు దండనాధుఁడై విఖ్యాతి గాంచినాఁడు. వీరింటి పేరు "కొట్టరువువారు" కొట్టరువువారు మొదటి నుండియు నమాత్యపదవులయందసమానులై రాజ్య చక్రము త్రిప్పి దిగంత విశ్రాంత యశోమహితులై గణన కెక్కిరి.
ఏ మహానుభావుడు మహా భారతమునందలి పదునైదు పర్వములను బూరించి తన మృదుమధుర కవితాప్రవాహముచే నాంధ్ర ప్రజాహృదయముల నాప్లావితములొనర్చి కవి బ్రహ్మయై యభయకవిమిత్రుఁడై యెప్పరెనో , ఎరాసవత్కవిశేఖరుని సువర్ణ నామాక్షరములు ఆంధ్రభాషాయోష కలంకార ప్రాయములై వెలయుచుండెనోఆ మహాకవి తిక్కనసోమయాజి కొట్టరువు వంశోద్భవుడైన కొమ్మనామాత్యుని కుమారుడే.
ఏ వీరాగ్రేసరుఁడు తన నిరుపమాన రణకేళీవిలాసములచే శత్రుసముచ్చయముపై దుమికి తుత్తునియలొనర్చి జయలక్ష్మి సమేతుఁడై యఖండఖ్యాతి నార్ణించెనో, ఏ సేనాని యపరసేనానియై నిజ ఖడ్గ చాలనముచే విక్రమపుర సింహాసనమును సుప్రతిష్టిత మొనరించి "యభినవపరశురాము" డను కీర్తి సముపార్జించెనో యా యభిమానధనుఁడు , ఖడ్గతిక్కన కొట్టరువువంశోద్భవుఁడైన సిద్దనామాత్యుని జ్యేష్టనందనుఁడే.
సిద్దనామాత్యుని కుమారుఁడగుటవలన సిద్దయతిక్కఁడనియును, ప్రోలాంబికానందనుఁడగుటచేఁ బ్రోలమతిక్కఁడనియును, మైలమ యనుదాసిపెంచుటచే మైలమతిక్కఁడనియును, రణరంగమునందదసహయశూరుఁడై శత్రుచమూసమూహమును జించిచెందాడుటచే రణతిక్కనయనియును, ఖడ్గమును ద్రిప్పుటయం దద్వితియ నైపుణ్యము గలావాఁదగుటచే ఖడ్గ తిక్కన యనియును నా వీరవతంసునకు నైదు విధమ్ములగు నామమ్ములు వచ్చినవి.
బాల్యము నుండియును ఖడ్గతిక్కనకును, గవి తిక్కనకును నన్యోన్యస్వభావములయందు మిక్కిలి భేదము గాను పించుచుండెను. కవితిక్కనకుఁ జిన్నతనమునుండియుఁ జడుపు సంధ్యలయందు శ్రద్ధ యదికము. ఖడ్గ తిక్కనకు మొదటి వారము నుండియు , నాటపాటలయందాసక్తి మెండు. కవితిక్కన శాస్రములతోఁ బ్రొద్దుపుచ్చుచుండెను. ఖడ్గ తిక్కన శాస్త్రములతోఁ గాలము గడుపుచుండెను. కవితిక్కనకు మంత్రంగములన్నఁబ్రీతి. ఖడ్గ తిక్కనకు మల్లయుద్దములన్న ప్రాణము. ఒకరికి బుద్దిబలమఖండము. మరియొకరికీ భుజబల మపారము. ఒకరిది బ్రాహ్మణధర్మము వేరొకరిది క్షాత్రధర్మము.
ఒకే వంశమున జన్మించినను, అన్నదమ్ములబిడ్డలైనను తిక్కనద్వయము స్వభావసిద్దములగు మనఃప్రవృత్తులచే భిన్నముగఁ గానుపించుచుండిరి.
బాల్యమునుండియుఁ బాఠశాల నెగఁగొట్టి బాలురతో నాటకాలాడుచుఁ గోటలెక్కుచు నల్లరి చిల్లరగాఁ దిరుగుచున్న కుమారుఁడేట్లు త్రోవకువచ్చు నాయని సిద్దనామాత్యుడుఁ మిక్కిలి విచారించెను. కాని క్రమక్రమముగా ఖడ్గతిక్కన మహావీరుఁడై రణరహస్యములు నెరింగి యనుపమాన తేజోవిరాజితుఁడగుటఁ గాంచి ప్రోలమాంబా సిద్దనామాత్యుల హృదయములు సంతోష నరసిలో నోలలాడసాగెను. చివరకు వారి భాగ్యవశమున ఖడ్గతిక్కన మనుమసిద్ది మహీపాలుని సర్వసేనాధక్ష్యుఁడై, మహామాత్యపదవిని గ్రహించిన కవితిక్కనకు ప్రేమపాత్రుఁడై సింహపురరాజ్యలక్ష్మి కాధారస్తంభమై వీరాధివీరుఁడై వేలుఁగొందినాఁడు.
ఇవ్విధమునఁ గవితిక్కనయును, ఖడ్గతిక్కనయును మనుమసిద్ది మహారాజునకుఁ గుడియేడను భుజములుగా నుండి, రాజ్యచక్రమును నడిపించుచుండిరి. ఆలమున ఖడ్గతిక్కనకును, ఆలోచనమునఁ గవితిక్కనకును నెందును నెదురు లేకుండేను. యోగ్యులైన మంత్రియును, సేనాపతియును లభించుటచే మనుమసిద్దినృపాలుఁడు మిక్కిలి సంతోషిత స్వాంతుఁడై పగవారికిఁ గన్నేర్రగా నెల్లూరును పాలించుచుండెను. వీరి సహాయముచే నా రాజపుంగవుండు పెక్కు పర్యాయములు ప్రతిపక్షులఁ దునుమాడి జయలక్ష్మిని గైకొనియేను.
అసమయమునఁ గాటమరాజు కనిగిరిసీమను పరిపాలించుచుండెను. అయన రాజధాని యేర్రగడ్డపాడు . కాటమరాజు పెద్దిరాజు కుమారుఁడు , గొప్ప వీరుఁడు, యాదవులందరునితని నవతారపురుషునిగా భావించుచుండిరి. నెల్లూరి రాజులకును, యాదవరాజులకును మొదటి నుండియు నంతఃకలహములు గలవు. తిక్కనృపాలుఁడు గతించిన వెంటనే యవి మరింత వృద్ది పొందసాగెను. వారును వీరును పరస్పరవిరోధములఁబెంచుకొని యవకాశమునకై వేచియుండిరి. కలహము పెంచుకొని కయ్యము సేయఁదలంచువారలకుఁ గారణములే లేకుండునా?
3
ఒకానొకదినమ్మున నఖండవైభపేతుఁడై మంత్రిసామంత దండనాదసమెతుఁడై మనుమసిద్దిమహీపాలుఁడు సింహపుర సింహాసనముపై గొలువు దీరియుండెను. అట్టి సమయమునఁ గొందరు యాదవులు సబా మంటపములోనికిఁ జనుదెంచి మహారాజునకు శిరస్సులు వంచి మ్రొక్కిరి. భయభ్రాంతవదనములతో నున్న యా యాదవసముదాయమును సింహపురాదీశ్వరుఁడు కరుణారసప్రసన్న వీక్షణములతోఁదిలకించును నొక్కప్రక్కఁగూర్చుండ నియమించి వచ్చిన కారణమును విన్నవించుకొనుఁడని యాజ్ఞాపించెను. వారలయందొక పెద్దగొల్ల లేచి ముందుకు రెండడుగులు వైచి హస్తములు జోడించి "మహారాజా! మేము కాటమరాజు రాజ్యములోని వారలము. మాది కనిగిరిసీమ. దేవరవారిసందర్శనమునకై మారాజు మమ్ములను తమ యొద్దకుఁ బంపించినాఁ "డని పలికెను.
కాటమరాజు పంపున వచ్చినవారని వినినంతనే మనుమసిద్దిమహరాజు సాభిప్రాయముగ మహామంత్రియగు తిక్కనామాత్రుని వైపు తన దృష్టి ప్రసరింపఁజేసెను. తిక్కనామాత్యుఁడు గొంచెమాలోచించి "ఒరే౧ మీ రాజు మిమ్ముల నేల పంపే? మీరు వచ్చిన కార్యమెద్దియో మహారాజులవారికి విన్నవించుకొనుఁ"డని యాదవులవైపు చూచి పలికెను.
Previous Page
Next Page