Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 52
మహారాజీ విధముగాఁ బలికినంతనే సభయంతయు నానందోత్సాహములతోఁ బొంగిపోయెను. తగిన నిర్ణయమనియు, మహారాజు చిన్నవాఁడయినను మంచి దూరాలోచానముగలవాఁడనియును, నిఁకవిక్రమపుర రాజ్యము మూఁడు పూలాఱు కాయలుగా దినదినాభివ్రుద్ది నందఁగలదనియును సభాసదులు పెక్కు విధముల ననుకొనుచుండిరి.
సభ్యుల యంగీకారసూచకముగ జయజయ నినాదములును, కరతాళధ్వనులును మిన్ను ముట్టెను. సిద్దన మందహాస వదనముతోఁ దన ప్రక్కలఁ గూర్చుండియున్న యువద్వయమువైపు దృష్టి సారించెను. ఆ యువకులిరువురు కవితిక్కనయు, ఖడ్గతిక్కనయునని మన మూహించవచ్చును.
మనుమసిద్దిమహారాజు బంగారు పళ్ళెరములో నొక బాహుమూల్య శిరోవేష్టనమును, నొక సముజ్జ్వల కరవాలమును, మరికొన్ని యుపహారములను సిద్దముగావించి సిద్దనామాత్యునివైపు నబహుమానముగఁ గనుఁగొనేను. మహారాజుగారి యుద్దేశము గ్రహించి సిద్దనమంత్రి కుమారుల నిరువురును చెఱియొక కరమున గ్రహించి ముందుకు నడచెను. మనుమసిద్దినృపాలుఁడు కవితిక్కనకు శిరోవేష్టనమును, ఖడ్గతిక్కనకు మహా ఖడ్గమును బహుకరించెను. మహా మాత్యముద్రాంకితములగు మణిమాయభూషణములను కవి తిక్కన కలంకరించెను.సర్వసేనానాయక ముద్రాముద్రితములైన రాత్నాభారణములను ఖడ్గ తిక్కనకుఁ గైసేసెను.
తనబుద్ది బలముచే సింహపుర రాజ్యము నభివ్రుద్ది పరచిమనమసిద్దిమహీపాలుని సింహాసనమును సుప్రతిష్ఠత మొనరింపఁగలనని కవితిక్కన ప్రమాణము నలిపెను. నిజఖడ్గధారచేఁ బ్రతిపక్ష సమూహములను జించి చెండాడి విక్రమ సింహపురమును విజయలక్ష్మి విరాజితమును గావించి యాంధ్రసామ్రాజ్యము నభివృద్దిసేయఁగలనని ఖడ్గతిక్కన ప్రతిజ్ఞ గావించెను. "నాయనలారా! రాజభాక్తులై ప్రజాసేవ యొనరించి మన కొట్టరువు వంశమునకు యశస్సు సంపాదింపుఁ " డని సిద్దనమంత్రి కుమారులను ప్రభోదించెను.
మంత్రవిదులగు మహీసుర పుంగవు లావీరపుంగవులను సింహపురప్రధానామాత్యపీఠమునకును, ప్రధాన సేవాధ్యక్షపదవికిని యధావిధి నభిషెకించిరి. వృద్దపురంద్రీమణులు మంగళగీతములు పాడిరి. మనుమసిద్ది మహారాజు శరీరము పులకించేను. సిద్దనామత్యుని నయనాంచలముల నానందబాష్పములు ప్రవహించేను. సోదరులిరువురు నొకరి నొకరు చూచుకొనిరి. అంగీకారసూచకముగా వారి వదనకమలములు దరహాసభాసురములయ్యేను.
2
ప్రస్తుతము నెల్లురని పిలువఁబడుచున్న పట్టణమునకే పూర్వము విక్రమసింహపుర మను నామము ప్రసిద్దమైయుండినది. ఆ పట్టణప్రాంతముననే పినాకినది యెడ్డుల కంటి యే ప్రొద్దును ప్రవహించుచుండును, ఆ పెన్నా నదీ జలములచే నందలి భూములన్నియు సస్యశ్యామలములై , కోమలములై చూపఱనేత్రములకు విందుగావించుచుండును. ఇంతియే కాక యా కాలమున నిప్పట్టణమునందఱవదిదేవాలయము లుండేడివి. పట్టణవాసులందఱు "నెఱజాణ" లనవన్నేకేక్కియుండిరి. ఆ నగర వీధులన్నియు నానాదేశముల నుండి యెడ తెగక వచ్చు'చుండు సార్ధవహులతోడను, నుత్తమాశ్వములతోడను, మద గజేంద్రములతోడను నిండియుండెను, ఇట్లు సకలసంపదల కాలవాలమై , వీరాధివీరులకు జన్మభూమియై నిత్యకళ్యాణములతోఁ బచ్చతోరణములతో నమరావతీ పట్టణమునాకు నీడగు విక్రమసింహపురమును రాజధానిగాఁ జేసికొని తిక్కభూపాలుఁడు ప్రజా పాలనము గావించుచుండెను.
తిక్క భూపాలుడు సూర్యవంశోద్భవులయిన తెనుఁగు చోళులలోనివాఁడు ఇతఁడు మొదట కాంచీపురము రాజధానిగాఁ బరిపాలించుచున్న కులోత్తుంగ చోడదేవునకు సామంతుఁడుగా నుండెను. తరువాత నాతఁడు గతించిన తోడనే తిక్కనృపాలుఁడు స్వతంత్రుఁడయ్యెను. ఆ సమయమునఁ గాంచీపుర సింహాసనమును గూర్చి రాజరాజనరేంద్రుని వంశీయులగు చాళుక్య చోళులయందలి వాఁడగు మూఁడవ రాజరాజునకును మూఁడవ రాజేంద్ర చోడునకును కలహము సంభవించెను. అట్టి యెడఁ దిక్కనృపాలుఁదు మూడవ రాజరాజుపక్షము వహించి రాజేంద్రచోడునిపై యుద్దము చాటించేను.
రెండు వైపులవారికిని జాలకాలమువరకుఁ బోరాటములు జరుగుచునే యుండెను. చివరకుఁ దిక్క భూపతి రాజేంద్రచోడుని జయించి రాజరాజచోడుని గాంచీపుర రాజ్యమునకుఁ బట్టాభిషిక్తునిఁగావించి "చోడసింహాసనస్థాపనా చార్య" బిరుదము నందేను. ఇట్లు తిక్కనృపాలుడు ప్రతి మానశౌర్యుధనుఁడై పరభయంకరుఁడై యనేకసంగ్రామరంగముల విజయలక్ష్మిని పరిగ్రహించి విక్రమసింహపురమును పెక్కు సంవత్సరములు పరిపాలించి క్రీ.శ. 1250 వ సంవత్సరమున లోకంత రగతుడయ్యెను.
తిక్కభూపాలుని యనంతరము తదీయ పుతరత్నమగు మనుమసిద్ది నృపాలుఁడు రాజ్యమునకు వచ్చెను. సింహాసనము నెక్కునప్పటికి మనుమసిద్ది చాలా పిన్న వయస్సు వాఁడు . ఈతఁడును దన జనకునివలెఁ బరాక్రమ శాలియైనను బాలుఁడగుటచే రాజకార్యములయం దంతగా సామర్ద్యము సంపాదింపకపోవుట గ్రహించి పరభూపతుల కన్నులన్నియు విక్రమ సింహపురము పైఁబడెను.
తిక్కభూపాలుఁడు గతించుటతోడనే యెక్కడివారక్కడ విజ్రుంభీంచిరి. దేశమందంతటను నల్లరులు వ్యాపించెను. పరస్పరయుద్దముల వలన పెక్కు రాజవంషములు నశించిపోవుచుండెను. తిక్కనృపాలుఁడు రాజరాజచోడుని గాంచీపురసింహాసనాసీనుంగావించినను దానిని గూర్చి చోళులలోఁ గోట్లాట లింకను తగ్గలేదు ; అన్యోన్యము రాజ్యాధికారము కొరకై తగువులాడుచునే యుండిరి. మధురాపురపుఁ బండ్యులును, హాళేవీటి హోయసలులును , ఓరుగంటి కాకతీయులును , దేవగిరి యాదవులను చెలరేఁగి స్వతంత్య రాజ్య సంస్థాపనమునకై ప్రయత్నించుచుండిరి. ఈ పరస్పర కలహాములతో , నూత్న రాజ్యస్థాపన ప్రయత్నములతో నన్యోన్యవిద్వేషములతో దక్షిణాపదమంతయు కల్లోలితమై పోవుచుండెను.
Previous Page
Next Page