Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 47


    ఇయ్యది ప్రపంచములో సమస్త వస్తుసముదాయముచే నిండియున్న మంచి నగరముగా నున్నది..... ఉత్తరమున నగర ప్రాకారాలకు వెలుపల సుందరము లగు గొప్ప దేవళములు గలవు. అందొకటి విఠలస్వామి దేవళము; అనే గొంది పురమున కెదురుగఁ గట్టఁబడియున్న రెండవది "హంపీదేవాయ"మని ప్రసిద్ది గాంచిన విరూపాక్షలయము. ఈ దేవాలయములోఁ దూర్పుగా నున్న ముఖద్వారము కెదురుగా మిక్కిలి సుందరమై యింపుగాఁ గట్టఁబడిన యిండ్లను, వసారాలును గలిగిన రమ్యమైన యొక వీధి కలదు.....నేనా నగరమున నుండినపుడు "నవరాత్రి ఉత్సవములు" మహావైభవముగ జరుపబడినవి. కృష్ణానదికి దక్షిణమున నున్న హిందూ దేశము నంతయును నీ రా జేకచ్చత్రముగ నేలెను. ఇదిగాక తూర్పున గాటకమువరకును, పశ్చిమోత్తరదిశల బిజాపురాది పట్టణముల వరకును దండెత్తి ప్రబల శత్రువుల నందఱిని గెలిచెను. ఇతఁడపజయ మన్నమాట యేఱుగడు. ఈ విషయములో నితనిని "క్రోంవెల్ " తోఁ బొల్చవచ్చును.....ఈ రాజునకు యుద్దము చేయుటకు గాను పదిలక్షల సైన్యము గలదు. ఈ సేన లన్నిటికిని రాజు జీతము లిచ్చుచుండెను. ఇతని యెద్ద సామజము లనేకములు గలవు. తన రాజ్యము చుట్టు నుండు శత్రురాజులకుఁ దన పరాక్రమము జూపవలసినప్పుడు ఇరువదిలక్షల సైన్యము నైనము యుద్ధ భూమికి రప్పింప సామర్ధ్యము గలవాఁడని చెప్పుదురు. ఆ కారణముననే యీ రాజును జూచి యెల్ల శత్రురాజులును భయపడుచుందురు.......అధికముగా నాదాయము వచ్చు ప్రభులనేకు లీతనికి లోఁబడినవారలాయి కప్పములు గట్టుచుందురు......ఈ రీతిగా రాజు పదిలక్షల సైన్యము యుద్దము చేయుటకెప్పుడు సిద్దముగా నుండునట్లు చేసికొనెను. ప్రతిసేనాధి పతియు దానక్రింద నుండు సైనికులకు దానే జీతము లిచ్చును......ఈ సేనలో నా కెక్కడను ఒక్క పిరికివాఁడైనఁ గాన్పింపలేదు..... కృష్ణరాయలు మిక్కిలి పొట్టివాఁడు కాఁడు, పొడవు వాఁడును గాఁడు. సామాన్యమైన ఎత్తుగలవాడై చక్కని ముఖము వర్చస్సును, సుందరాకారమును, దృడశరీరమును గలిగి యుండును. రాయల ముఖము మీద స్పోటకపు మచ్చలు కలవు. అతని ముఖవికాసము చూచినవారికీ నాతని యెడఁ బూజ్యభావము పుట్టించును. శరీరమును గట్టి పఱచి యుద్దమునకుఁ దగినంత దృడముగ నుంచుటకై యతడు ప్రతి దినమును  శరీర సాధనము చేయుచుండెను. అన్ని విధములగు సాములు......రా జేఱుంగుటయే గాక ప్రతిదిన మభ్యసించుచుండెను. విలువిద్యలో , ఖడ్గవిద్యలో నాతఁడారిదేరియుండెను.....ఈ నగర విస్తీర్ణతను గురించి నేను వ్రాయను. ఏలయన నయ్యదియొక ప్రదేశము నుండి చూచుటకుఁ గానరాదు. నేనొక కొండ యెక్కి యేక్కువ భాగము చూడగలిగితిని......అచట నుండి చూడగా నాకుఁ గనుపట్టిన భాగము "రొమ్" నగరమంత పెద్దిగా నుండి చూపునకు మిక్కిలి సుందరముగాఁగన్పించినది."
    ఫేయస్" వర్ణించిన వర్ణనమును జదివి శ్రీ కృష్ణ దేవరాయలనాఁటి సామ్రాజ్యమును. అనాఁటి విజయనగర వైభవమునుమన మూహించు కొనవచ్చును. అట్లు విదేశీయులచే నుత్తమొత్తమముగ వర్ణింపఁబడిన మహా పట్టణమునకు నే డెంట=త గతిపట్టినది! ఎటు జూచినను శిదిలములే!
    అట్లు మాతంగపర్వతముపై నెక్కి జీర్ణవిజయనగరమును దర్శించుచున్న మాకు వరుసగా నాయా ప్రదేశముల నాచార్యులు చేతితోఁ జూపుచు వివరించి చెప్పెను.
    "అదిగో! అది ఇంభాపురము. అందు వాలి కాష్టమున్నది. అది పూర్వమానెగొంది నుండి కమలాపురమునకుఁ బోవు ఘంటపధము. మానకోకింత యాగ్నేయముగా నున్న పర్వతము మాల్యవంతము .దానిపైఁ గనుపించునది రఘునాధ స్వామి యాలయము. అదిగో! అది కమలాపురము.దానికి కొంచేమీశాన్యముగా నొకగుడి కనిపించుచున్నది. అది పట్టాభి రామాస్వామి దేవాలయము. మనకు దక్షిణముగా నొక పెద్ద యావరణమును,నందులో మరియొక చిన్న యావరణమును గనుపించుచున్నవి. పెద్దది రాచనగరు. చిన్నది రాణివాసము. అవి రాయలవారి గుఱ్ఱపు శాలలు. అదిగో! అది ఉగ్రనరసింహ విగ్రహము. దాని కేదురుగనున్న శిదిలములు నరసింహపురము. ఇదిగో! ఇది కృష్ణస్వామి యాలయము. ఆ మందిరములు కృష్ణాపురము. ఇదిగో విరూపాక్షదేవాలయము. ఆ పర్వతము హేమకూట,ము. దాని మీద జైన దేవాలయములు చూడుఁడు! అదిగో విరూపాక్షాలయము ప్రక్కగా తుంగభద్రానది! మనకేదురుగా నుత్తరపువైపున నది కావల గాండ్లు పేర్చినట్లొక కొండ కానవచ్చుచున్నది. అది ఋష్యమూకపర్వతము అదిగో! ఆ గుట్ట చాటున శ్రీ కోదండ రామస్వామి యాలయమున్నది. దాని సమీపములోనే చక్రతీర్ధ మున్నది. అదిగో! అచ్యుతాలయము. కనుపించు చట్టుపై సీతాసరోవరమున్నది. మనకీశాన్యమునొక పెద్ద దేవాలయమును దాని యందొక దీర్ఘమైన విదియు గనిపించుచున్నది. చూడుఁడు , అదియే విఠలా లయము. ఆ వీధి విఠలాపురము. తుంగభద్ర కావలి యొడ్డున మన కీశాన్యదిక్కుగా నగపడు కోటయానెగొంది! దాని ద్వారమునకు బడమరగ గనుపించునది తలారిగట్టు. దాని వెనుకవైపు పంపాసరోవర మున్నది."
    నాకా శిదిలములను జూచుచున్న కొలది గుండెలు బరువెక్కుచుండెను. ఏదియో చెప్పుటకు వీలు కాని ఉత్కంఠ, ఆవేశము, ఆవేదన, అనుభూతి హృదయమున నాక్రమించెను. ఉదయముననే లేచి వరుసగా నన్నియు చూచుటకు నిశ్చయించుకొని కొండ దిగితిమి.
    మరురోజుదయముననే కాలకృత్యములు దీర్చుకొని కాఫీని త్రాగిన యనంతరము జీర్ణ విజయనగర సందర్శనమునకై బయలుదేరితిమి. ఇట్లు మేము హంపీలో మూడు రోజులుండి యందలి శిదిలముల నెల్ల జూచితిమి. మేము చూచినవానిని సంక్షేపముగా నీ క్రిందఁ దెలుపు చున్నాను. మేము ప్రప్రధమమున "శ్రీ విరూపాక్తస్వామి దేవాలయము"ను సందర్శింపనేగితిమి. విరూపాక్షుడు విజయనగరాదీశ్వరులకులదైవము. విద్యానగర దేవాలయము లన్నిటి కంటే విరూపాక్షాలయము పెద్దది, ప్రాచీనమైనది కూడను. ఈ దేవాలయము తుంగభద్రానదీతీరమున నేఁడు కనుపించుహంపీ బజారున కెదురుగనున్నది దేవాలయము తూర్పుముఖముగా నలరారుచున్నది. గుడి చుట్టును సమున్నతమైన ప్రాకారము గలదు. ప్రాకారమునకు నాలుగువైపుల నాలుగు పెద్ద పెద్ద గోపురము లున్నవి. అన్నింటికన్న దూర్పుదిశయందలి గోపురమెత్తయినది. అది శ్రీకృష్ణదేవరయలచే నిర్మింపబడినదని చెప్పుదురు. అది సున్నము తోడను నిటుకులతోడను గట్టబడినది. గోపురము మీద చుట్టును జక్కని విగ్రహములనేకములు చెక్కబడి యున్నవి.

 Previous Page Next Page