బావి, సంపు ఎటువైపు ఉండాలి?

(Well, Borewell, Sump in Vastu)

ఒకప్పుడు ఎక్కువమంది బావి తవ్వించుకునేవాళ్ళు.. ప్రస్తుతం బావుల స్థానంలో బోర్ వెల్స్ వచ్చాయి. అలాగే మునుపటిలా అనేక పాత్రల్లో నీళ్ళు నిలవ ఉంచడానికి బదులుగా సంపులు, ఓవర్ హెడ్ టాంకులు వచ్చాయి. పూర్వం చిన్న చుట్టు గుడిసె వేసినా, చెట్టు కింద రాళ్ళ పొయ్యి పెట్టినా అది ఎటువైపు ఉంటే మంచిదో తెలుసుకుని ఆ ప్రకారం ఏర్పాటు చేసేవారు. క్రమక్రమంగా కొన్ని ఆచారాలను, వాస్తు శాస్త్ర సూత్రాలను చాదస్తాల కింద జమకట్టి పాటించడం మానేస్తున్నాం. కానీ అలా వాస్తు నియమాలకు విరుద్ధంగా నడచుకోవడంవల్ల సహజంగానే దుష్ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని అనేకమంది అనుభవాలు రుజువు చేస్తున్నాయి.

 

వాస్తును పాటిస్తే అంతా శుభం చేకూరుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు ఘోరంగా ఉంటాయి.

వాస్తు ప్రకారం బావి, బోర్ వెల్, నీళ్ళ సంపు ఎటువైపు ఉంటే మంచిదో, ఎటువైపు ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బావి, నీళ్ళ సంపులను తూర్పు మధ్యభాగం నుండి తూర్పు ఈశాన్యం వరకు ఏర్పాటు చేసుకోవచ్చు.

అలాగే ఉత్తర మధ్యభాగం నుండి ఉత్తర ఈశాన్యం వరకూ ఉంటే కూడా మంచిది.

బావి, నీళ్ళ సంపు ఉండకూడని దిక్కులు

పశ్చిమంలో ఉండకూడదు.

ఆగ్నేయంలో ఉండకూడదు.

నైరుతిలో ఉండకూడదు.

దక్షిణంలో ఉండకూడదు.

         ఈ దిక్కుల్లో బావి, నీళ్ళ సంపు లేదా గొయ్యి గనుక ఉంటే ప్రమాదం. ఆకస్మిక మరణాలు, అనారోగ్యాలు, ఆపదలు సంభవించవచ్చు.

గోతులు, సంపులకు సంబందించి మరికొన్ని సూచనలు ఉన్నాయి

పిల్లర్ లేదా స్తంభం ఎదురుగా ఉండకూడదు.

ప్రహరీ గేటు ఎదురుగా ఉండకూడదు.

ఇంటి తలుపులకు ఎదురుగా ఉండకూడదు.

రెండు లేదా అంతకంటే ఎక్కువ సంపులు లేదా నీళ్ళు పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసే పల్లపు ప్రదేశాలు ఉన్నప్పుడు వాటిల్లో తక్కిన వాటికంటే ఈశాన్యంలోని సంపు లేదా గొయ్యి ఎక్కువ లోతుగా ఉండాలి.

Well, Borewell, Sump in Vastu, Vastu East borewell, vastu east sump, vastu north sump, vastu north borewell, sump in west, sump in south, vastu sump and borewell remedies

 


More Vastu