వివేకానందుడి మాటల్లో గీతాసారం!!

భగవద్గీత అంటే కృష్ణుడు, అర్జునుడు వారి మధ్య వాదన, కృష్ణుడు చేసే జ్ఞానబోధ అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. అయితే గీత గురించి స్వామి వివేకానంద చెప్పిన విషయం తెలుసుకుంటే గీతలో ఉన్నది ఇదని మాకు తెలియదే అనుకుంటారు.

అర్జునుణ్ణి వశం చేసుకొన్న  భ్రాంతిని నివారించటానికి భగవానుడు ఏం చెప్పాడు? ఎవరినిగాని పాపి అని దూషించవద్దనీ, అతడిలో ఉన్న సర్వశక్తిదిశకు అతడి చూపును మరల్చవలసిందనీ నేనెప్పుడూ చెబుతూంటానే, అలాగే భగవానుడు అర్జునుడికి చెప్పాడు. నైతత్త్వ య్యుపపద్యతే, "ఇది నీకు తగదోయి!" "నువ్వు ఆత్మవు, సమస్త పాపాలకు అతీతుడవు, అనశ్వరుడవు. నీ యథార్థ స్వరూపాన్ని మరచిపోయావు. 'నేను పాపిని, దేహ దోషాపస్నుడను, మనోవ్యధితుణ్ణి,' అనే నువ్వు తలచుకోవడమే నిన్ను ఇలాటి వాడిగా తయారు చేసింది. "నీకిది తగదోయి!" అని భగవానుడు చెప్పాడు. 

"క్లైబ్యం మా స్మృగమః పార్థః" పార్థా, బలహీనత పడకు! లోకంలో పాపంలేదు. దైన్యం లేదు, వ్యాధిలేదు, విషాదం లేదు. లోకంలో పాపం అని అందరూ అనుకునేది ఏదైనా ఉంటే అది ఇదే భయం మాత్రమే.

నీలో గూఢంగా ఉన్న శక్తిని బహిర్గతం చేస్తుంది. ఏ పని అయినా పుణ్యమనీ, దేహాన్ని మనస్సుని దుర్బలపరచే పనే నిజమైన పాపమనీ గ్రహించు. ఈ దౌర్భల్యాన్ని, ఈ భీరుత్వాన్ని దులిపివేసుకో! "క్లైబ్యం మా స్మ గమః" పార్థ! నువ్వు వీరుడివి, ఇది నీకు తగనిది అని కృష్ణుడు ఆ అర్జునుడికి పదే పదే చెబుతాడు. భయం కాదు మొదట కర్తవ్యం చేయడం మాత్రమే అందరికీ కావాలి అని. 

ఈ విషయన్ని గురించి వివేకానందుకు  ఇలా చెబుతాడు:- 

బిడ్డల్లారా! "క్లైబ్యం మా స్మగమః పార్థ నైతత్ త్వ య్యుపపద్యతే" అనే ఈ సందేశాన్ని మీరు లోకానికి చాటితే సమస్తవ్యాధి, విషాదం, పాపం, దుఃఖం ఈ భూమి మీదనుండి మూడురోజుల్లో మటుమాయమవుతాయి. ఈ దౌర్బల్యపు తలంపులేవీ ఎక్కడా ఉండవు. ఇప్పుడిది ఈ భయకంపన ప్రవాహం సర్వత్రా ఉంది. మీరీ ప్రవాహాన్ని తిప్పివేయండి; అభయ స్పందన వెంటబెట్టుకుని ఈ లోకానికి కొత్త ఉత్తేజాన్ని, కొత్తదనాన్ని ఇవ్వండి. అప్పుడు కలిగే అద్భుత పరివర్తనాన్ని చూడండి.  మీరు సర్వశక్తిమంతులు. ఫిరంగిలా ముందుకు పొండి, భయపడొద్దు. మీకు ఎవరైనా పాపం చేసేవాళ్ళు కనబడితే ఎంతటి పాపినైనా ద్వేషించవద్దు. అతడి బాహ్యావరణాన్ని చూడొద్దు. మీ దృష్టిని లోనికి మరల్పండి. అక్కడ పరమాత్మ ఉన్నాడు. భేరీనాదంతో లోకమంతటా చాటండి."నీలో పాపం లేదు; దైన్యం లేదు. నువ్వు అసాధ్య సాధకశక్తివి. లే, మేలుకో, నీలోని దివ్యత్వాన్ని వ్యక్తపరచు."

క్లబ్యం మా స్మగమః పార్థ నైతత్ త్వ య్యుపపద్యతే ||

క్షుద్రం హృదయర్బల్యం త్యక్త్వాత్తిష్ఠ పరంతప ॥

ఈ ఒక్క శ్లోకాన్ని పఠిస్తే చాలు. సమస్త గీతాపారాయణ ఫలం లభిస్తుంది. గీతాసందేశమంతా ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉంది. అంటూ ఎంతో గొప్ప సందేశాన్ని తన ఉపన్యాసంలో చెబుతాడు వివేకానందుడు. 

◆  వెంకటేష్ పువ్వాడ


More Others