పక్కకి తప్పుకొనేది లేదు

 

 

నిందంతు నీతి నిపుణా యది వా స్తువంతు

లక్ష్మీః సమావిశతు గచ్ఛతు వా యథేష్టమ్‌ ।

అద్యైవ వా మరణమస్తు యుగాంతరే వా

న్యాయ్యాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః ॥

పొగడ్తలు రావచ్చు లేదా నిందలు రావచ్చు. సంపదలు రావచ్చు, పోవచ్చు. మరణం ఇప్పటికిప్పుడే సంభవించవచ్చు లేదా యుగాంతం వరకు చిరంజీవిగా నిలిచి ఉండవచ్చు. కానీ ధీరులు తాము న్యాయం అనుకున్న మార్గం నుంచి అడుగైనా పక్కకి తొలగరు.


More Good Word Of The Day