మేషరాశి - అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి
ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు.ఇంటబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభం - కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి
ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి - మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి.
ఈ వారం ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు సమసిపోతాయి. ఆలయ దర్శనాలు తీసుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరతాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటక - రాశి పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి
ఈ వారం ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహమున శుభ కార్యాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు కలసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభసూచన లున్నవి. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహ రాశి - మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి
ఈ వారం చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తగ్గుతాయి. చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి యత్నాలు సఫలామౌతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్య - ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి
ఈ వారం చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు. దాయాదుల తో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి - చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి
ఈ వారం నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చిక రాశి -విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి
ఈ వారం దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. స్థిరస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు రాఘవన్ చేస్తారు. వారం మధ్యలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూత రుణాలు చేస్తారు. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సు రాశి - మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి
ఈ వారం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి - ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి
ఈ వారం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభ రాశి -ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి
ఈ వారం చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి -పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి
ఈ వారం నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
