ఆ దాహం తీరేది కాదు!

 

పూర్ణం వర్షసహస్రం మే విషయాసక్తచేతసః

తథాప్యనుదినం తృష్ణా మమ తేషూపజాయతే॥

 

నిండు నూరేళ్లు కాదు, వెయ్యేళ్లపాటు విషయాల వెంట పరుగులు తీయవచ్చుగాక. మనసులో మెదిలిన ప్రతి కోరికనీ తీర్చుకోవచ్చుగాక. కానీ ఆ దాహం ఎప్పటికీ తీరేది కాదు. ఒకదాని వెంట మరొకటిగా మనసులో తృష్ణ మెదులుతూనే ఉంటుంది. ప్రతిరోజూ విషయాల వెంట పరుగులు తీయిస్తూనే ఉంటుంది.

 

 


More Good Word Of The Day