మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏమిటి?

 

Information on which tree should be planted as per your janma nakshatra

 

జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలు ఎలాసంభవిస్తాయో వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చెయ్యాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకుంటూ ఉంటాము. మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు. మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది.

 

Information on which tree should be planted as per your janma nakshatra

 

మీరునాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, వీథి పక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటండి. అది పెరిగేలా శ్రద్ద చూపించండి. మీరు మొక్క నాటాక వాటి పోషణకు సమయం చాలదనుకుంటే మీస్వంత డబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయండి. మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆవృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలో శుభాలు వెల్లివిరుస్తాయి.

ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి

 

Information on which tree should be planted as per your janma nakshatra

జీడిమామిడి

 

అశ్వని - జీడిమామిడి
భరణి - దేవదారు
కృత్తిక - అత్తి [మేడి]
రోహిణి - నేరేడు
మృగశిర - మారేడు
ఆరుద్ర -చింత
పునర్వసు - గన్నేరు
పుష్యమి - పిప్పలి
ఆశ్లేష - బొప్పాయి

 

Information on which tree should be planted as per your janma nakshatra

మఱ్ఱిచెట్టు



మఖ - మర్రి
పుబ్బ - మోదుగ
ఉత్తర - జువ్వి
హస్త - కుంకుడు
చిత్త - తాడి
స్వాతి - మద్ది
విశాఖ - మొగలి
అనూరాధ - పొగడ
జ్యేష్ఠ - కొబ్బరి

 

Information on which tree should be planted as per your janma nakshatra

వేగి



మూల - వేగి
పూర్వాషాఢ - నిమ్మ
ఉత్తరాషాఢ - పనస
శ్రవణం - జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ - జమ్మి
శతభిషం - అరటి
పూర్వాభద్ర - మామిడి
ఉత్తరాభాద్ర -వేప
రేవతి -విప్ప


More Enduku-Emiti