తిరుమల వేంకటేశ్వరునికి నైవేద్యం ఏమిటి?
(Tirumala Venkateswara Naivedyam)
.png)
తిరుమల వేంకటేశ్వరుని పేరు చెప్పగానే లడ్డూ ప్రసాదం గుర్తొస్తుంది. మనం భక్తిగా స్వీకరించే లడ్డూ ప్రసాదం సంగతి అలా ఉంచితే ఏడుకొండలవానికి ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసుకుందాం.
ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణం. కానీ తిరుమలేశునికి ఈ కృత్రిమ స్టవ్వులమీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించరు. సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్న ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా, స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూలవిరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు.
తిరుమల వేంకటేశ్వరునికి ''ఓడు'' అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని ''మాతృ దద్దోజనం'' అంటారు.



