రేపే శని జయంతి.. ఈ అయిదు రాశుల వారికి ఎంత అదృష్టమంటే!

శని పేరు చెబితే చాలా మంది భయపడతారు. శనిదేవుని చూపు సోకితే ఇక బోలెడు కష్టాలు, కన్నీళ్లు జీవితంలో ఉంటాయని అనుకుంటారు. కానీ అందరు దేవుళ్ళకు ముక్కితే వరాలు కురిపిస్తారేమో కానీ శనిదేవుడు మాత్రం చేసిన పనులకు కర్మ ఫలితాన్ని అంత బాదల్లేకుండా గడిచిపోయేలా చేస్తాడు. ఇదీ శని దేవుడి ప్రత్యేకత. ఇప్పుడు శని దేవుడి ప్రస్తావన ఎందుకంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటారు. శనిదేవుడిని ఆరాధించడం వల్ల ఆయన అనుగ్రహం లభించి జీవితంలో ఈతిబాధలను వాటి ప్రభావం లేకుండా పరిగెట్టిస్తాడు. శనిదోషం, శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు శనిదేవుడిని జ్యేష్ఠ అమావాస్య రోజు ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అయిదు రాశుల వారు శని దేవుడిని కాస్త ప్రసన్నం చేసుకున్నా చాలు వారు పట్టిందల్లా బంగారం అయ్యి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ శని జయంతి నాడు శనిదేవుడు అనుగ్రహించే 5 రాశులు ఏవో ఏవంటే..

వృషభ రాశి..

శుక్రుడు శని దేవుడితో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఈ కారణంగా వృషభ రాశి వారికి శని దేవుడి నుండి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి.  వృషభ రాశి వ్యక్తులు డబ్బు, పదవి, గౌరవం పొందుతారు. ఈసారి . శని అనుగ్రహంతో వృషభ రాశి వారికి జరిగే చెడు పనులన్నీ సద్దుమనుగుతాయి.

కర్కాటక రాశి..

శని దేవుడు కర్కాటక రాశి మీద సంచరిస్తున్నాడు. ఆయన అనుగ్రహం వల్ల ముఖ్యమైన పనులలో కొన్నింటిని పూర్తి చేసే అవకాశం చాలా ఉంది. ఏ పనుల్లో అయినా కుటుంబ సభ్యుల మద్దతు కొరవడి ఉంటే ఆ ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇక వృత్తి పరంగా  ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. ధన లాభం చేకూరుతుంది.

తులా రాశి 

తుల రాశి వారికి శనిదేవుని అనుగ్రహం చాలా ఉంది. ఆయన్ను శని జయంతి సందర్భంగా ఆరాధిస్తే మరింత శుభ ఫలితాల ఉంటాయి.  శనిదేవుడిని అనుగ్రహం వల్ల పనులలో విజయం, ధనలాభం, ఐశ్వర్యం పొందుతారు. మరీ ముఖ్యంగా కీర్తి, గౌరవం పెంపొందుతాయి. 

మకర రాశి

శని దేవుడు మకర రాశికి అధిపతి కాబట్టి మకర రాశి వారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆయన అనుగ్రహం వల్ల అనుకున్న పనులను సమర్థవంతంగా నెరవేరుస్తారు. ఉద్యోగ, వ్యాపారంలో పురోగతిని పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో చురుకుగా ఉన్న వ్యక్తులు శని దేవుడి అనుగ్రహం కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. 

కుంభ రాశి

శని దేవుడు రాశిచక్రానికి అధిపతి కాబట్టి, శని లగ్నం కలిగిన వ్యక్తులకు ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కుంభ రాశి వారికి  ఇంకా ఏడున్నర సంవత్సరాలు శని దశ  కొనసాగుతున్నప్పటికీ, శని జయంతి రోజు శని దేవుడిని ఆరాధించడం వల్ల ధనలాభం కలిగే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం, గౌరవం రెండూ లభిస్తాయి. 

కాబట్టి పైన అయిదు రాశుల వారు శని దేవుడిని ఆరాధించడంలో ఆశ్రద్ద చేయకండి.

                                      ◆నిశ్శబ్ద.


More Others