శివపురాణంలో పేర్కొన్న రహస్యాలు..!
.webp)
శివుడు తన భక్తులకు చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తాడని అంటారు. కానీ గొప్ప ఋషులు, సాధకులకు మాత్రం శివుని దర్శనం పొందడం కష్టమని భావిస్తారు. వాస్తవానికి శివ పురాణంలోని రుద్ర సంహితలో, శివుని దర్శనం పొందడానికి ఎన్నో సాధించడానికి వివిధ రహస్యాలు పేర్కొన్నారు. రుద్ర సంహితలో ఉన్న వీటి ప్రకారం శివుడి దర్శనం లభించడం మాత్రమే కాకుండా ఎన్నో కోరికలు కూడా నెరవేర్చుకునే యోగ్యం లభిస్తుంది. శివపురాణంలో చెప్పబడిన ఆ రహస్యాల గురించి తెలుసుకుంటే..
శివ పురాణంలోని రుద్ర సంహిత ప్రకారం, శివ పూజ, ధ్యానం ద్వారా ప్రతి కోరిక నెరవేర్చుకోవచ్చు.
గత జన్మల గురించి తెలుసుకుని గత జన్మ పాపాలు తొలగించుకోవాలంటే..
రుద్ర సంహిత ప్రకారం శివుడిని భక్తితో పూజించి, మహామృత్యుంజయ మంత్రాన్ని లక్ష సార్లు ఏకాగ్రతతో జపించే వారి గత జన్మల పాపాలు తొలగిపోతాయట. మరోవైపు మహామృత్యుంజయ మంత్రాన్ని 2 లక్షల సార్లు జపించడం వల్ల వ్యక్తి తన గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోగలడట.
కోరికలు తీర్చుకోవడానికి..
శివపురాణం ప్రకారం మహామృత్యుంజయ మంత్రాన్ని 3 లక్షల సార్లు జపించే వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతారు. మరోవైపు, మహామృత్యుంజయ మంత్రాన్ని 4 లక్షల సార్లు జపించే భక్తుడికి పరమేశ్వరుడు స్వయంగా కలలో కనిపిస్తాడు. ఇది చాలా అరుదుగా పరిగణించబడుతుంది. కలలలో శివుని దర్శనం జీవితంలోని అన్ని సమస్యలను అంతం చేస్తుంది.
శివ దర్శనం పొందే మార్గాలు..
ఎవరైతే మహామృత్యుంజయ మంత్రాన్ని 5 లక్షల సార్లు జపిస్తారో వారి ముందు శివుడు ప్రత్యక్షమై దర్శనం ఇస్తాడని శివ పురాణంలో ప్రస్తావించబడింది. అంతేకాకుండా మహామృత్యుంజయ మంత్రాన్ని 10 లక్షల సార్లు జపించేవారు శివలోకంలో స్థానం పొందేందుకు అర్హులు అవుతారు. అలాంటి వ్యక్తి మోక్షాన్ని పొందడం సులభం అవుతుంది.
ఆనందం, శ్రేయస్సు పొందడానికి..
శివపురాణంలోని రుద్ర సంహితలో 1 లక్ష శమీ ఆకులతో శివుడిని పూజించే వారు మోక్షాన్ని పొందుతారట. . 1 లక్ష బిల్వ పత్ర ఆకులపై ఓం నమః శివాయ అని రాసి శివుడికి సమర్పించడం ద్వారా ప్రపంచంలోని ప్రతిదీ సులభం అవుతుంది. ప్రతి ఒక్కరూ అన్ని ఆనందాలను, శ్రేయస్సును పొందుతారట.
గమనిక..
శివపురాణంలో పొందుపరచిన కొన్ని విషయాల ఆధారంగా పురాణ పండితులు చెప్పిన విషయాల ప్రకారం ఈ సమాచారం ఇవ్వబడింది.
*రూపశ్రీ.


