కలిమిగల లోభికన్నను
విలసితముగ పేదమేలు వితరణి యైనన్ 
చలచెలమ మేలుకాదా!
కులనిధి అంభోధికన్న గువ్వలచెన్నా!

ధనవంతుడి దగ్గర ఎంత సంపద అయినా ఉండవచ్చుగాక. కానీ అతను పిసినారి అయితే, ఆ ధనం వల్ల ఉపయోగం ఏముంది? అతనికంటే దానగుణం కలిగిన పేదవాడు మేలు కదా! దాహాన్ని తీర్చలేని సముద్రం కంటే చిన్న మంచినీటి చెలమ వల్లే మనకు ఉపయోగం కదా!
 


More Good Word Of The Day