శ్రీ పంచముఖాంజనేయ అవతారం విశిష్టత?

 

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 

 

ఈస్వామి ఐదుముఖాలతో, పది భుజాలతో, పది ఆయుధాలను ధరించి దర్సనమిస్తుంటాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నారసింహ ముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విలసిల్లుతుంటాడు. ప్రతి ముఖంలో త్రినేత్రుడై ప్రకాశిస్తుంటాడు. స్వామి పది చేతులలో 1.కత్తి, 2.ఢాలు, 3.పుస్తకం, 4.అమృత కలశం, 5.అంకుశం 6.గిరి, 7.హలము, 8.కోడు, 9.సర్పము, 10.వృక్షము కనిపిస్తుంటాయి. ఈ ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణచి, జ్ఞానదీపాన్ని వెలిగించి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసేవే. ఇది ఆంజనేయుని పరిపూర్ణరుద్రావతారం. ఈ అవతార మూర్తిని విభీషణుని కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంతబల సంపన్నుడైన నీలుడు సమస్త విద్యలలో పండితుడు. ధర్మాచరణంపట్ల అనురాక్తిగాలవాడు. సంపదలలో కుబేరునికి దీటైనవాడు. అయినప్పటికీ నీలునికి తృప్తి కలుగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని సేకరించాలన్న తపన, ఒకరోజు నీలుడు తండ్రి విభీషణునితో, “తండ్రీ! మనకు సంపదలకు, వైభావాలకు లోటు లేదు. కానీ, ఎంత ఉన్నప్పటికీ, మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనసెంతో వేదనకు గురవుతోంది. విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు భక్తుడవు. నీకు ఆ మహనీయుడు ఆరాధ్యదైవం. అయినప్పటికీ, నువ్వు వాటిని సాధించాలేకపోయావు. వాటిని నువ్వెందుకు పొందలేకపోయావు? అయితే, నువ్వు నాకిప్పుడు అనుమతినిస్తే క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రీ!” అని పలికాడు.

 

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 


కొడుకు మాటలు విన్న విభీషణుడు, “పుత్రా! రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు, అదే మనకు సర్వానందదాయకమైంది. దానిని మించిన సిరిసంపదలతో మనకేమి పని? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కావు. అందువల్లనే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం అయినట్లయితే, వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం కనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందాల్సి ఉంటుంది. తద్వారా లోకోత్తరశక్తులను పొందగలిగితే, అటుపై నీ కోరిక నెరవేరుతుంది” అని హితవచనాలను పలికాడు.

 

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 


తండ్రి ఆజ్ఞను శిరసావహించిన నీలుడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు భక్తిప్రపత్తులతో సేవించి, గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, “నాయనా, నీలా! నీ కోరిక నెరవేరాలంటే, అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికితోడు ఒక వ్రతం గురించి కూడ చెబుతానూ. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆనంజనేయుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే, సాధించలేనిదంటూ ఏమీ ఉండదు" అని తెలిపి, దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి, వ్రతం కూడ చేయించాడు. నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి, ధ్యాన నిమగ్నుడయ్యాడు.

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 

 


కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకు సంతుష్టుడైన హనుమంతుడు, పంచాముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. నీలుని బహువిధాలుగా స్వామిని స్తుతించగా, నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, “భక్తా, నీలా! నీ కోరిక త్వరలో నేరావేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి అత్యంత మిత్రుడు. ఆత్మబంధువుకంటే ఎక్కువ. ఆందుకే నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రుడవు. నువ్వుకోరుకున్న విధంగానే చింతామణి మొదలైన దివ్యసంపదలు నీకు సొంతమవుతాయి. వాతితొపాటు శీలసౌందర్యాది విశేషగుణ  నిధియైన వసుందరిని కూడ పొందగలవు. అందుకే ఈ పవిత్రక్షేత్రం నీ పేరుతో నీలాద్రిగా వ్యవహరింపబడుతుంది” అని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు, తల్లిదండ్రులకు మొక్కి, వారి ఆశీర్వాదాలను అందుకున్నాడు.

 

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 


అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు, ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశ్యాన్ని వినిపింపజేసాడు. “ఓయీ ఇంద్రా! గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బందిపబడ్డావు. ఇప్పుడు విభీషణుని కుమారుడనైన నేను, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను.  నాతో యుద్ధం చేసి పరాభింపబడతావా? లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా, నువ్వు నాతో యుద్ధం చేయలేవు కనుక, ఆ దివ్యరత్నాలను నాకివ్వు, బ్రతికిపో. నీలుని సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. “ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధసామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల, వేల కోట్లకొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలావుంటే, నీలుడొకలెక్క?! అందుకే ఈ దూతను శిక్షించి, పరాభావించి పంపించండి" అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉందంతాన్ని చెప్పగా, ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధభేరిని మోగించాడు.

 

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 


దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలుపైకి ఉరికి, “ఓయీ! నీలా! వాలి నా పుత్రుడు. అతడు నీ పెదనాన్న చంకలో పెట్టుకుని సప్త సాగరాలలో ముంచగా, ఎలాగో ప్రాణాలను దక్కించుకుని బ్రతికిన విషయం నీకు తెలియదా?!” అని ఇంద్రుడు చెబుతుండగా, నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేయసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేయగా, ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచి వేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృభించగా, నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. అనంతరం నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలునితో, "ఓయీ నీలా! నీ తండ్రి రామభక్తుడు, రాముడంటే శ్రీమహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు. ఈ ఇంద్రుడు. అందువల్ల ఇతడు నీకు మిత్రుడేగానీ, శత్రువుకాదు. ఇతనితో తగవులాట వద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటిని నేను అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను.

 

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 


పూర్వం అత్రిమహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తుండగా, ఆ మహనీయుని నేత్రాల నుండి దివ్యతేజస్సు వెలువడింది. ఆ తేజస్సు, అందులోని వృక్షాలతో కూడి పలురీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్యతేజాన్ని రెండు రాశువులుగా విభజించగా, అందులో నుంచి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి నుంచి త్రిభువన సుందరియైన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృతస్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడ గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించనందువల్ల మాకు కూడ గౌరవ పాత్రుడవయ్యావు అని చెప్పాడు.  బ్రహ్మ ఇలా చెప్పడమే కాక, మహత్తర శక్తి సంయుతమైన హనుమద్ర్వతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తుసంపదల తోడుగా సౌందర్యరాశియైన వనసుందరిని కూడ అర్పింపజేసాడు. ఆవిధంగా హనుమదనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలతో నీలుడు హనుమద్భక్తులలో అగ్రగణ్యునిగా వెలుగొందాడు. నీలునికి హనుమంతుడు మాఘమాసం ఆర్ధ్ర నక్షత్రంతో కూడిన దినంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లంకలో సీతాదేవికి పంచాముఖాంజనేయ రూపాన్ని స్వామి ప్రదర్శించినట్లు మనకు తెలుస్తోంది.

 

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 


రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. “శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగూన్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది”. ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు. శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటిబిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరీక్షంలోగల శతకంఠుని నగరం కనబడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాలవలె ఉన్నప్పటికీ, వాయునందనుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేసాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేట్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్లు చేసాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి, శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖంఢిస్తున్నప్పటికి, ఆ తలలు తిరిగి జనించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపుబొట్లు నేలపై పడుతుండగా, వాటి నుంచి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవించసాగారు. వాతితో పోరాడిన శ్రీరాముడు విసికి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేకులు మూర్చిల్లారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గానంతరం తెలియక చింతించసాగింది.

 

Info on Lord Hanuman  Pancha Mukha Anjaneya Swami Avatharam, Sri Panchamuka Hanuman Story

 

 


సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి, హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్టతో జపించగా, హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృభించాడు. ఆంజనేయస్వామి పంచముఖం మూర్తియై వెలుగొందుతూ రాక్ష్సుని మాయాశక్తులను వీక్షిస్తూ, అతని కదలికలన్నింటిని అరికట్టేడు. ఆయన ప్రతి వదనంలో మూడేసి కళ్ళున్నాయి. దశ భుజాలలో దశ విధ ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలువిధాలైన రూపాలను ధరించగా, ఆంజనేయుడు కూడ అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడ యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. ఆంజనేయుని అభ్యర్థనను విన్న సీతాదేవి పతిదేవుని తలచుకుని శక్తి స్వరూపిణియై, శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు స్త్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున, సీత వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. ఇదే పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ.


More Hanuman