తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ రోజు

 

Article about Brahmotsavam Tiruchanur 9th Day of Goddess Sri Padmavathi Ammavari Kartheeka Brahmotsavam Tiruchanur

 

 

ఉదయం 4 గంటలకు అమ్మ వారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలను నిర్వహించారు.శనివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. 8 నుంచి 9.30 గంటల వరకు ముఖమండపంలో అమ్మవారికి చూర్ణాభిషేకం, ఆస్థానం నిర్వహించి తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి పంచమితీర్థం మండపంలో కొలువుదీరుస్తారు.

 

 

Article about Brahmotsavam Tiruchanur 9th Day of Goddess Sri Padmavathi Ammavari Kartheeka Brahmotsavam Tiruchanur

 

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఘట్టం పంచమి తీర్థం (చక్రస్నానం) వేడుక. అమ్మవారు అవతరించిన పద్మసరోవరంలో ప్రతియేటా నిర్వహించే పంచమితీర్థం రోజున స్నానమాచరిస్తే సకల పాపాలు హరించుకుపోయి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి పంచమి తీర్థానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శనివారం సారెను తీసుకురానున్నారు. అలిపిరి నుంచి శ్రీవారి సారెను ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామ ముఖభాగంలోని పసుపు మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నాలుగుమాడ వీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి శ్రీవారి సారెను అమ్మవారికి నివేదించి పూజలు చేస్తారు. చివరగా సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పద్మపుష్కరిణిలో చక్రస్నానం చేయిస్తారు.

 

 

 

Article about Brahmotsavam Tiruchanur 9th Day of Goddess Sri Padmavathi Ammavari Kartheeka Brahmotsavam Tiruchanur

 

గజ, దేవత మరియుపద్మావతి ఖగోళ క్యారియర్, ముద్రణ పవిత్రమైన పసుపు వస్త్రం జెండా బంగారు ధ్వజస్తంభము, ఉదయం 07.55 నుండి 8.35 మధ్య పవిత్రమైన వృశ్చిక లగ్నం వద్ద ఆలయంలోని ఉన్న ధ్వజస్తంభంపైన ఆలయం పూజారులు వేద శ్లోకాలను సంప్రదాయ పారాయణ మధ్య ఎగురవేయ్యబడింది.10.30 నుంచి 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. మధ్యాహ్నం 12.05 నుంచి 12.12 గంటల మధ్య ధనుర్లగ్నంలో చక్నస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 10 గంటల వరకు అమ్మవారిని బంగారు తిరుచ్చిపై మాడా వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చకులు ధ్వజ స్తంభంపై ఉన్న గజచిత్రపటాన్ని అవరోహణం చేయడంతో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


More Venkateswara Swamy