Home » Temples » నవగ్రహ దోషాలకు పరిష్కారం చూపే శైవ క్షేత్రం..!

నవగ్రహ దోషాలకు పరిష్కారం చూపే శైవ క్షేత్రం..!

జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు మనిషి మానసికంగా చాలా కుంగిపోతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న పనులు జరగకపోవడం, అనారోగ్య సమస్యలు వెంటాడటం లాంటి సందర్భాలలో దైవం మీద,  పూజలు, వ్రతాలు,  ఆచారాల మీద  నమ్మకం మరింత పెరుగుతుంది. మొక్కని దేవుడు ఉండడు,  దర్శించని క్షేత్రం ఉండదు. సాధారణంగా నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు పూజలు చేయడం మనం చూస్తుంటాం. అయితే, నవగ్రహాలు అన్నింటినీ విడివిడిగా కాకుండా ఏకంగా లింగాకారంలో దర్శించుకునే అరుదైన ఆలయం ఉంది.  ఆ ఆలయం ఏమిటో,  అదెక్కడ ఉందో.. ఇక్కడి ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకుంటే..

నవగ్రహ లింగాలు క్షేత్రం..

 నవగ్రహ లింగాల క్షేత్రం అస్సాం రాష్ట్రంలోని గువాహాటి నగరంలో ఉంది. గువాహాటిలో ప్రసిద్ది చెందిన  చిత్రాచల కొండపై ఈ నవగ్రహ మందిరం వెలిసింది. సాధారణంగా ఇతర ఆలయాలలో నవగ్రహాలు విగ్రహాల రూపంలో కనిపిస్తుంటాయి, కానీ ఇక్కడ మాత్రం పరమేశ్వరుడు తొమ్మిది వేర్వేరు లింగాకారాలలో కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తాడు.

మన దేశంలో ఎన్నో ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు తమ ప్రత్యేకమైన శిల్పకలతోనూ, మరికొన్ని మహిమాన్వితమైన విశేషాలతోనూ భక్తులను ఆకట్టుకుంటాయి. అలాంటి కోవకు  చెందినదే ఈ నవగ్రహ లింగ రూప టెంపుల్. సాధారణంగా మనం శివాలయాల్లో ఒకే శివలింగాన్ని దర్శించుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆలయం లోపలికి వెళ్లగానే తొమ్మిది గ్రహాలు వేర్వేరు లింగాకారాలలో కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

మన జాతకంలో గ్రహాల గతి తప్పుడమే మన కష్టాలకు ప్రధాన కారణమని నమ్ముతుంటాం. అలాంటి గతి తప్పిన గ్రహాలను సైతం గాడిలో పెట్టే శక్తి ఈ ప్రత్యేకమైన నవగ్రహ లింగాలకు ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనిషి తట్టుకోలేని తీవ్రమైన సమస్యలు, మానసిక వేదనలు , అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతారు.

ఇది కూడా చదవండి  నందీశ్వరుడి దర్శనం చేసుకోకుండా శివుడిని దర్శించుకోవచ్చా..పురాణాలు ఏం చెబుతున్నాయంటే..!

ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఒక సరికొత్త ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నవగ్రహ లింగాలను దర్శించుకుంటూ తమ కష్టాలను తొలగించమని వేడుకుంటారు. మన జీవితాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల అనుగ్రహం పొందడానికి ఇటువంటి పుణ్యక్షేత్రాల దర్శనం ఎంతో మనశాంతిని ఇస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగడానికి ఇక్కడి దివ్య వాతావరణం భక్తులకు ఎంతో మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.

                                                                                                                                      *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు   గాల్లో తేలే వింత ఆలయం.. ఎక్కడ ఉంది.. దాని ప్రత్యేకతలేంటి.!

                                 తీరని కష్టాల్లో ఉన్నప్పుడు హనుమ ఆరాధన చేయమని చెబుతారు ఇందుకే..!
 

google-ad-img