శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి?

 

శ్రీరస్తు
శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం 'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'

 

 

Lord Hanuman Pradakshina: What is the significance of Hanuman Pradakshina

 

శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.

 

Lord Hanuman Pradakshina: What is the significance of Hanuman Pradakshina

 

అభి షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి
మంగళ వార సేవ
మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.

 

Lord Hanuman Pradakshina: What is the significance of Hanuman Pradakshina

 

శనివార సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.
పంచ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.
హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ, కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారేడుదళం, సింధూరం మల్లెపూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.


More Hanuman