శ్రీరామ నవమి నాడు సూర్యతిలకం ప్రత్యేకత ఏంటి? ఈ రోజు సూర్యుడిని ఆరాధిస్తే  జరిగేదేంటంటే!


భారతీయులు శ్రీరాముడిని తమ ప్రభువుగా భావిస్తారు.   మనుషుల మధ్య మనిషిగా పుట్టి ఈ లోకానికి ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని పరిచయం చేసినవాడు శ్రీరాముడు.  భారతదేశంలో ఇదివరకు కంటే ఇప్పుడు రామ నామ స్మరణ మరింత ఎక్కువగా ఉంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత ఆధ్యాత్మికత, దైవభక్తి మరింత ఇనుమడించాయని చెప్పవచ్చు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో  రాముని ప్రతిష్ట తరువాత ఇప్పుడు అయోధ్యలో వైభవంగా జరిగే రామ నవమి వేడుకకు దేశం యావత్తు సన్నాహాలు చేస్తోంది. శ్రీరామ నవమి నాడు రాముడికి సూర్యతిలకం దిద్దనున్నారు. 500ఏళ్ల తరువాత మొదటిసారి అయోధ్య లోని రామమందిరంలో రాముని పుట్టనరోజు వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సూర్య తిలకం ప్రత్యేకత  ఏంటి? శ్రీరామ నవమి రోజు సూర్యుడిని ఆరాధిస్తే జరిగేదేంటి తెలుసుకుంటే..

హిందూ మతంలో సూర్యుడికి ఎనలేని ప్రాధాన్యత  ఉంది. ముఖ్యంగా సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు సూర్యవంశీయుడు. ఈయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. శ్రీరాముడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడంతోనే తన రోజును ప్రారంభించేవాడు. మరొక ఆసక్తికర విషయం అగస్త్య మహర్షి స్వయంగా ఆదిత్య హృదయం స్తోత్రాన్ని శ్రీరామునికి ఉపదేశం చేశారు.  ఇలా శ్రీరామునికి, సూర్యునికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.

శ్రీరామ నవమి రోజు సూర్యుడి ఆరాధన ప్రాముఖ్యత..

 హిందూ మతంలో పంచదేవుని ఆరాధన గురించి చెప్పబడింది. ఇందులో గణేశ ఆరాధన, శివారాధన, విష్ణు ఆరాధన, భగవతీ దేవి ఆరాధన,  సూర్య ఆరాధన ముఖ్యమైనవి.  ప్రతిరోజూ సూర్యుడిని ఆరాధించడం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. సూర్య భగవానుని ఆరాధన చాలా సరళంగా ఉంటుంది. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకునేందుకు రోజూ సూర్యోదయ సమయంలో అర్ఘ్యం సమర్పిస్తారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కూడా సూర్యునికి ప్రాముఖ్యత ఎక్కువ. ప్రజల జాతకంలో సూర్యుని స్థానం వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఎవరి జాతకంలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడో..  ఎవరి గ్రహాల కూడలి లో  పవిత్రమైన ఇంట్లో  సూర్యుడు ఉంటాడో అలాంటి  వ్యక్తులు జీవితంలో అన్ని రకాల గౌరవం, కీర్తి,  సంపదలను పొందుతారు. శ్రీరాముడు సూర్య వంశీయుడు. కనుక శ్రీరామ నవమి రోజు సూర్యుడిని ఆరాధించడంల వల్ల సూర్యుడి కృప లభిస్తుంది. సూర్యుడి కటాక్షం ఉంటే జాతకంలో మిగిలిన అన్ని గ్రహాల ప్రభావం, దోషాలు తక్కువగా ఉంటాయి.


                                           *నిశ్శబ్ద. 


More Sri Rama Navami