హోలీ..హోలీ..హోలీ...

హోలీ సంబర శుభాకాంక్షలు... హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్ధం. ప్రతియేటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీపండగ అని, కాముని పున్నమి అని డోలికోత్సవమని అంటారు. ఈ ఉత్సవం పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తే....... రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. 

దీంతో ప్రహ్లాదుణ్ణి  మెట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని రాక్షస సోదరి హోళికని పిలిచి ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చెయ్యాలని అభ్యర్ధించాడు. ఆమె సరేనంది. వెంటనే ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకిందట. విష్ణుమూర్తి మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోళిక రాక్షసి మంటల్లో చనిపోయిందట. హోలిక దహనమైనది కనకనే ఈ రోజుని హోలీ అని అంటారట. 

హోలీ రోజున పలుప్రాంతాలలో... లక్ష్మీనారాయణవ్రతం, చంద్రపూజ వంటివిచేస్తారు. మన తెలుగువారు ఈరోజు చంద్రపూజ, సత్యనారాయణ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తి ప్రపత్తులతో చేస్తారు. చిన్నారులు, యువతీయువకులు, మహిళామణులు, అందరూ సకుటుంబ సపరివారసమేతంగా.... కలసి కట్టుగా హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఆనంద పరవశులవుతారు.

 


More Holi Purnima