నెల్లూరు రాజరాజేశ్వరీ దేవాలయం
(Nellore Rajarajeswari Temple)
.png)
రాజరాజేశ్వరీ దేవాలయం నెల్లూరు దర్గమెట్టలో ఉంది. ఇది పురాతన ఆలయం కాదు. ఈమధ్య కాలంలోనే కట్టిన ఆధునిక దేవాలయం.
ప్రాచీన వైభవం లేకపోతేనేం ఎంతో అందంగా నిర్మించారు రాజరాజేశ్వరీ దేవాలయాన్ని. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఊరట పొందడానికి గుడికి వెళ్తాం. నెల్లూరు రాజరాజేశ్వరీ దేవాలయానికి వెళ్ళడం ద్వారా ఆ ప్రయోజనం తప్పకుండా నెరవేరుతుంది. భక్తులు ప్రశాంత చిత్తంతో వెనుదిరిగి వస్తారు.
అమ్మవారు కాత్యాయని, కనకదుర్గాదేవి, రాజరాజేశ్వరీ దేవి, కాళీమాత, మహాగౌరి, మహిషాసురమర్దిని - ఇలా ఏ రూపంలో ఉన్నా మహోన్నతమైనదే. మనల్ని ఊరడిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అమ్మవారు భక్తజనావళిని సంరక్షించే శక్తి స్వరూపిణి.
మాతృస్వామ్య సమాజంలో జగన్మాత గ్రామదేవతగా వెలిసింది. పితృస్వామ్య వ్యవస్థలో మహాశివుని అర్ధాంగిగా సేవలు అందుకుంటోంది. నెల్లూరు రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి నిత్యం జరిపేపూజా కార్యక్రమాలతో బాటు పర్వదినాల్లో విశేష సేవలు, ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు.



