అన్నవరం సత్యన్నారాయణ స్వామి
(Annavaram Satyanarayana Swamy)
ఆంధ్రుల ఆరాధ్యదైవం వీరవెంకట సత్యనారాయణ స్వామి కొలువున్న క్షేత్రం అన్నవరం. ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ క్షేత్రాలలో ఇదొకటి. రెండస్థులుగా నిర్మించిన ఇక్కడి ఆలయంలో లో కింది అంతస్థులో అత్యంత శక్తివంతమైన యంత్రం వేశారని, అదే ఈ ఆలయ దినదినాభివృద్ధికి కారణమని చెబుతారు.
సత్యనారాయణ స్వామి ఆలయం అంత పురాతామైనది కాదు. స్వామివారు కొలువైన ఈ కొండని రత్నగిరి అని పిలుస్తారు. రత్నగిరి చెంతనే ఉన్న పంపానది సమీపాన ఉన్న అడవులలో అనేక మూలికలు లభిస్తాయి.
వివాహం, ఉపనయనం, దత్తత స్వీకారాది మహోత్సవాలు ఇక్కడ జరుపుకుంటుంటారు. వీటన్నింటికీ మించి ప్రతిరోజూ స్వామివారిని దర్శించిన భక్తులు, సత్యన్నారాయణ వ్రతం చేసుకుంటారు.
కొత్తగా పెళ్ళయిన జంటలు మొదలు వందలాది జంటలు నిత్యం వ్రతం ఆచరించి, వ్రతఫలం పొంది ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతుంటారు.
సత్యనారాయణ స్వామి ఆలయంలో తప్పక చూడవలసింది నీడ గడియారం (సన్ డైల్). ఈనాటికీ ఇది ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంటుంది.



