ఎన్ని చేసినా కానీ...

 

 

వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్

కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః

ఆత్మైక్యబోధేన వినా విముక్తిః

న సిద్ద్యతి బ్రహ్మశతాంతరేపి (వివేకచూడామణి- 6)

 

ఒక వ్యక్తి ఎన్ని శాస్త్రాలనైనా అనర్గళంగా ఒప్పచెప్పవచ్చు, దేవతల కోసం ఎన్ని యజ్ఞాలనైనా చేయవచ్చు, ఎన్ని క్రతువులైనా ఆచరించవచ్చు, దేవతలను ఎంతగానైనా పూజించవచ్చు. కానీ ఈ సృష్టిని ఆవరించిన ఉన్న బ్రహ్మమే తనలోనూ ఉందన్న జ్ఞానం కలగనంతవరకూ... నూరుగురు బ్రహ్మల జీవితకాలం గడిచినా కూడా అతనికి ముక్తి లభించదు. 

 

..Nirjara


More Good Word Of The Day