ఇవి లేకుండా జరిగే వినాయక చవితి అసంపూర్ణం..!

అన్ని శుభకార్యాలకు ముందు పూజించబడే మొదటి దేవుడు గణేశుడు. గణేశుడి ఆశీర్వాదంతో పనిలో అడ్డంకులు తొలగిపోతాయని, విజయ అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. పురాణ గ్రంథాలలో గణపతిని జ్ఞాన దేవుడిగా భావిస్తారు. ఆయన కృప ద్వారా జ్ఞానం, విజయవంతమైన వ్యాపారం, కెరీర్‌లో మంచి ఫలితాలను పొందుతారు. అయితే వినాయకుడి అపార అనుగ్రహం పొందడానికి భాద్రపద మాసం చాలా శ్రేష్టం అని చెబుతారు. 'గణేష్ చతుర్థి'ని భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థిన జరుపుకుంటారు. వినాయకుడి పూజకు చాలా రకాల పండ్లు, పత్రి, పువ్వులు మొదలైనవి సమకూర్చుకుంటారు. అయితే వినాయక పూజకు తప్పని సరిగా అవసరమైన సముదాయం ఉంది. ఇవి లేకపోతే వినాయక పూజ, వినాయక వ్రతం అసంపూర్ణంగా ఉన్నట్టే.. ఇంతకీ వినాయక పూజకు తప్పనిసరిగా కావలసినవి ఏంటో తెలుసుకుంటే..
పూజ సామగ్రి జాబితా..
కాలానుగుణ పండ్లు(ముఖ్యంగా వెలగపండ్లు, చెరకు), ధూపం, దీపం
గంగా జలం, కర్పూరం, పచ్చి దారం
సిందూరం లేదా కుంకుమ, వినాయక విగ్రహం, కలశం, మోదకాలు లేదా కుడుములు, ఉండ్రాళ్లు
అరటిపండ్లు, వ్రత విధానం తెలిపే పుస్తకం
తమలపాకులు, గంధం, పూలు, బియ్యం,
చెక్క స్టాండ్, అరటి పిలకలు
పసుపు, ఎరుపు రంగు వస్త్రం, కొత్త బట్టలు
దుర్వ లేదా గరిక తప్పనిసరి, టెంకాయ, ఎర్రచందనం, పంచపాత్ర.
ప్రసాదం కోసం మోదకాలు, ఉండ్రాళ్లు మాత్రమే కాకుండా పాయసం, పరమాన్నం వంటివి కూడా నివేదించవచ్చు.
ఎరుపు రంగు పువ్వులు దొరికితే శ్రేష్టం.
32రకాలు పత్రి.. అన్ని దొరకకపోతే కనీసం 16 రకాలు అయినా సేకరించాలి.
అక్షింతలు, పువ్వులు, అజ్ఞోపవీతం, వస్త్రం.. ఇవన్నీ ఎరుపు రంగువే అయి ఉండాలి.
పైన చెప్పుకున్న వస్తువులు లేకుండా వినాయక చవితి వ్రతం చేసినా అది అసంపూర్ణంగా ఉంటుంది.
*రూపశ్రీ.



