జోస్యం తెలిసిన కప్పలు

Frogs Predict Earthquakes

 

కుక్కలు, చేపలు, కోళ్లు మొదలైన జంతువులకు సిక్స్త్ సెన్స్ ఉంటుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. తుపాను, భూకంపం, పురాతన భవనం కూలిపోవడం, మనిషి అవసానదశ లాంటి అనేక అంశాలను కుక్కలు, గేదెలు, కోళ్ళు మొదలైన జంతువులు ముందుగానే పసిగడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆఖరికి అణుబాంబుల దాడి లాంటి ఉదంతాలు జరిగేముందే జంతువులకి ఆ సంగతి బోధపడుతుందని పరిశోధనలు తెలియజేశాయి. హీరోషిమా నాగసాకి నగరాలమీద అణుబాంబులు ప్రయోగించే ముందే అక్కడి పశువులు కట్లు తెంచుకుని పారిపోయాయని, అల్లకల్లోలం చేసే విపరీతంగా రోదించాయని ఉదాహరణలు కూడా చూపించారు.

ఇకపోతే కప్పలు కూడా భూకంపాల రాకను ముందుగానే గుర్తిస్తాయని కప్పల మీద జరిపిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నిపుణులు చేసిన అధ్యయనాల్లో ఈ అంశం తేటతెల్లమైంది.

ఒకసారి ఇటలీలోని లాక్విలాలో భూకంపం సంభవించింది. ఆ భూకంపం రావడానికి మూడు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలోని కప్పలు అక్కణ్ణించి మాయమైపోయాయి. అంటే ఆ కప్పలకు భూకంపం జాడ ముందే తెలిసిందన్నమాట. కనుకనే అవి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయాయి. అక్కడ కప్పలన్నీ ఒకచోట చేరి సందడి చేసే చోటుకి భూకంపం వచ్చిన ప్రాంతం అతి సమీపంలో ఉండడం గమనార్హం.

లాక్విలాలో భూకంపం సంభవించిన పదిరోజులకు పారిపోయిన కప్పలు ఆ ప్రాంతానికి మళ్ళీ తిరిగి వచ్చాయి. ఈ విషయాన్ని జీవ శాస్త్రవేత్త రాచెల్‌ గ్రాంట్‌ వెల్లడించారు. కప్పల ప్రవర్తన, ప్రత్యుత్పత్తిపై చంద్రుని ప్రభావం గురించి రాచెల్ అనేక ప్రయోగాలు చేశాడు. దానికోసం ప్రత్యేకించి ఒక ప్రాంతంలోని కప్పలనే ఆయన తన పరిశోధనకు వినియోగించడం వల్ల ఈ విషయం బయటపడింది. భూకంపం సంభవించేందుకు ముందు మూడురోజులనుంచి లాక్విలా ప్రాంతంలో కప్పలు ఆ స్థలానికి రాకపోవడాన్ని, భూమి అల్లకల్లోలం ఒక దారికి వచ్చిన తర్వాత మాత్రమే తిరిగిరావడం రాచెల్ గుర్తించారు.

ఇలా మండూకాల మీద చేసిన వివిధ పరిశోధనల వల్ల గేదెలు, కుక్కలు మొదలైన జంతువుల మాదిరిగా వీటిక్కూడా కాలజ్ఞాన జోస్యం తెలుసునని స్పష్టమౌతోంది. అదీ సంగతి. మండూకాలు భూ కంపాల రాకను ముందుగానే పసిగడతాయని తేలింది. సాంకేతిక పరికరాల కంటే కూడా జంతువుల సిక్స్త్ సెన్స్ మహాద్భుతమైందని అర్ధం కావడంలేదూ?!


Frogs know about future, frogs and astrology, frogs and sixth sense, frogs know about earthquakes, frogs runaway before earthquake, Frogs and prediction


More Mysteries - Miracles