స్వాయంభువమనువునకు శతరుపయందు ప్రియవత్రుడు , ఉత్తానపాదుడు నను కుమారులు గలిగిరి .ఉత్తానపాదునకు సురుచి, సునీతియ భార్యలు గలరు . సునీతికి ధ్రువుడు , సురుచికి, ఉత్తముడును కుమారులు గలిగిరి .ఉత్తానపాదునకు సురచియందు ప్రేమ ఎక్కువ .

ఒకనాడు ఉత్తానపాదుడు చిన్న కొడుకును ముద్దుచేయుచుండగా ధ్రువుడు అచ్చటికివచ్చి తానును తండ్రి తోడ మీద నెక్కబోయను. సురుచి వానిని క్రిందికి లాగి ,''నీకు తండ్రి తొడ నెక్కు భాగ్యము మున్నచో నా కడుపునే పుట్టియుండేడివాడవు .అట్ల కావలెనన్నచో శ్రీనాథుని గుర్చి తపము చేసి వరము నొందు  ''మనెను ధృవు డేడ్చుచు తల్లి దగ్గరకు పోయి చేప్పెను ,తల్లి కుమార !ని సవతి తల్లి చెప్పినట్లుగా శ్రీ పతి పాదములను భక్తితో ధ్యాని౦పు ''మని ప్రోత్సహించేను .ద్రువుడు శ్రీ హరిని గుర్చి తపము చేయు నిశ్చయించి అడవికి బయలుదేరెను .

దారిలో నారదుడు కనిపించి ,''ఇంత చిన్న వయసులో నీవు తపమేమి చేయగల''వాని యడిగి అతని పట్టుదల చూచి ఆనందించి ద్వాదశాక్షరీమంత్రము నుపదేశించి ,యే మంత్రమైన ఏడురోజులు దీక్షగా జపించినచో సిద్ది కలుగునని బోధి౦చేను .ధ్రువు డాయనకు నమస్కరించి దీవెనలు పొంది యమునాతీరంలో గల మధువనమునకు బోయి తపమారంభిచెను.

నారదుడుత్తనపాదుని యొద్దకు వెళ్ళెను.అతడు ధ్రువు డింటికినుండి వెళ్ళిన సంగతి చెప్పెను .నారదుడు ,''నీ కొడుకు శ్రీహరిని సేవించి ఇతరులు పొందలేని మహోన్నతపదము నొందగల ''డని చెప్పెను . ధ్రువుడు నారదుడు వర్ణించిన మాధవుని రూపము మనసులో నిలుపుకుని నిరాహారుడై ఒంటికాలి మీద నిలిచి తపస్సు చేసెను .ఆ తపమునకు జగత్తు చెలించెను .

దేవతలు భయపడి ఇంద్రునితో చెప్పగా అతడు విఘ్నములు కలిగించెనుగాని ధ్రువుడు చలించలేదు .విష్ణువు ధ్రువుని యెదుట సాక్షాత్కరించెను .ఆయనను చూచి పరమానంద పడి సాష్టాంగప్రణామముచేసి ,స్తుతి౦చుటకు మాటలు రాక నిలుచుండెను .శ్రీహరి శంఖము నాతని బుగ్గలకు తాకించగా సకల విద్యలు కలిగి మహాజ్ఞానియై

శ్లో||యో౦త: ప్రవిశ్య మమ వాచ మిమా౦ ప్రసుప్తా౦ సంజీవయ త్యఖిలశక్తి ధర స్స్వధమ్నా, అన్యా౦శ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణన్నమో భగవతే పురుషాయతుభ్యమ్||

తా||ఏ పరమాత్మ నాలో ప్రవేసించి వాక్కును ప్రాణే౦ద్రియములను ప్రేరణచేసి చైతన్యవంతముగా చేయునో అట్టి పరమపురుషునకు నమస్కారము .అనుచు స్తుతించెను .విష్ణుమూర్తి అతనితో ,''నీ తపమునకు మెచ్చినాను .సప్తర్షిమండలముకంటెను ఉన్నతమైన ధ్రువ(విష్ణు )పదమును నీ కిచ్చుచున్నాను.నీవు నీ తండ్రి తరువాత ఇరువదియారు వేలేండ్లు రాజ్యమేలేదవు .నీ తమ్ము డొక యక్షుని చేతిలో మరణించెను నీ సవతి తల్లి దావాగ్నిలోపడి మృతి చెందెను ''అని చెప్పి అంతరార్ధమయ్యెను .

ధ్రువుడు ''నేను వైకుంఠు డిచ్చిన ఉన్నత పదముతో తృప్తిపడితినేమి?మోక్షము కోరకపోయితి ''నని విచారించి యింటికి వచ్చెను .తండ్రి ఆదరించెను .తండ్రి తరువాత ధ్రువుడు రాజయ్యెను .తమ్ము నొక యక్షుడు చంపగా కోపించి యక్షులతో యుద్దము చేసి చాలామందిని జంపెను .అది చూచి చిత్రరథుని (ధ్రువుని) తాత మనువు వచ్చి ,''నీవంటి విష్ణుభక్తులకు జీవహింస తగదు .యక్షులు శివ భక్తులు .వారినిజంపినందుకు శివుని ప్రసనం చేసుకో ''మని చెప్పగా ధ్రువుడు శివునిని ప్రార్ధించెను.

26000 ఏండ్ల తరువాత విష్ణుదూతలు వచ్చి ధ్రువుని విమాన మెక్కుమనిరి .అతడు తన తల్లిని గూర్చి విచారింపగా ఆ దూతలు ముందు ఒక విమానంలో నున్న సునీతని చుపిరి .ధ్రువుడు సర్వతెజోమండలములును దాటి పైనున్న విష్ణుపదమును (ఆకాశము , వైకుంఠము) చేరెను. నరులు, మునులు, దేవతలు, ధ్రువుని విష్ణువు భక్తిని ప్రశంసించిరి. దీక్షయున్నచో ఎవ్వరైనను ఉన్నతస్థానమును బో౦దగలరనుటకు కీ ధ్రువోపాఖ్యానమే ఉదాహరణము.


More Venkateswara Swamy