Home » Bhakti Content » Aacharalu »  పూర్వజన్మ పాపాన్ని తగ్గించుకోవచ్చా..ఇందుకోసం ఏం చేయాలి.!

 పూర్వజన్మ పాపాన్ని తగ్గించుకోవచ్చా..ఇందుకోసం ఏం చేయాలి.!

జీవితంలో మనం ఎన్నోసార్లు అనుకోని ఆటుపోట్లను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. ఎటువంటి తప్పు చేయకపోయినా మనకు మాత్రమే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని చాలాసార్లు బాధపడుతుంటాము. ఇలాంటి సమయంలో మన పెద్దలు, గురువులు పూర్వజన్మ పాపాలు, కర్మల ప్రభావం గురించి చెబుతుంటారు. గత జన్మల్లో చేసిన మంచి చెడుల ఆధారంగానే ప్రస్తుత జీవితంలో సుఖదుఃఖాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే అలా అని పూర్తిగా దానికి లొంగిపోయి కూర్చోవాలా లేక వాటిని తగ్గించుకోవడానికి మార్గం లేదా అనేదానిపై గురువులు ఎంతో విలువైన సత్యాలను వెల్లడించారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే..

మనం చేసే ప్రతి పనినీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు.  ఈ విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి. ప్రతి జన్మలోనూ మనిషి ఎన్నో పుణ్యాలను అలాగే కొన్ని పాపాలను చేస్తుంటాడు. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమయం వచ్చినప్పుడు వాటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ ప్రవాహం లాంటి సంసారంలో పడిన ప్రతి ఒక్కరిపై గత జన్మల కర్మల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. వెనకటి కర్మలకు అనుసారంగానే భవిష్యత్తు నడుస్తూ ఉంటుందనేది నూటికి నూరుపాట్లు వాస్తవమే.

అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గురువులు గుర్తుచేస్తున్నారు. గత కర్మల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ, మనిషి చేసే స్వయం కృషి, ప్రయత్నానికి ఒక విశేషమైన స్థానం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రవాహం వేగంగా వెళ్లే నదిలో పడిపోయాడు అనుకుందాం. ఆ నది ప్రవాహం ప్రభావం ఆ వ్యక్తిపై కచ్చితంగా ఉంటుంది, అది అతన్ని ఒక దిశకు లాకెళ్తూనే ఉంటుంది. కానీ అలా ప్రవాహానికి పూర్తిగా వదిలేయకుండా, ఆ వ్యక్తి తన సొంత బలాన్ని, శక్తిని ఉపయోగించి ఈదే ప్రయత్నం చేస్తే, ప్రవాహం లాగుతున్నప్పటికీ తనకు కావలసిన దిశకు చేరుకోగలడు.


అదేవిధంగా మనిషి కూడా గత జన్మల కర్మల ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ, వాటి చేత పూర్తిగా ప్రభావితుడై నిస్సహాయంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ప్రయత్నానికి ఎంతో శక్తి ఉంది. పూర్వజన్మ పాపాలు ఉన్నాయా లేదా అనే అనవసరమైన ఆలోచనలను, విచారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. వాటి గురించి ఆలోచించి కుంగిపోకుండా, మన ప్రయత్నాన్ని ఏమాత్రం తక్కువ చేయకుండా సత్ప్రవర్తనతో, మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి.

ఇది కూడా చదవండి  నాగుల చవితి నాడు  ఈ పూజ చేస్తే.. సర్పదోషాల నుంచి విముక్తి.!

ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకూడదు. కర్మ సిద్ధాంతం ఉంది కదా అని చేతులు కట్టుకుని కూర్చోవడం సరైన పద్ధతి కాదు. నిరంతరం మన వంతు మంచి ప్రయత్నం చేస్తూ ఉండడమే పూర్వజన్మ పాపాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏకైక మార్గం. మన ప్రయత్న బలం ముందు ఎలాంటి కర్మలైనా బలహీనపడక తప్పవు. కాబట్టి గతాన్ని తలచుకుని బాధపడడం కంటే, వర్తమానంలో మన ప్రయత్నాన్ని బలంగా నమ్ముకుని ముందుకు అడుగులు వేయడమే గురువులు చెప్పిన అసలైన రహస్యం.

                                                                                                                                    *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు   ప్రయాణాలలో, నడుస్తున్నప్పుడు మంత్ర జపం చేయవచ్చా.. మీకు తెలియని నిజాలివి..!​
అమృత గుండంలో వెలిసిన అమ్మవారి క్షేత్రం.. చ్యవన మహర్షి తపస్సు చేసిన పుణ్య స్థలం.. ఎక్కడంటే..!

Can You Reduce Past Life Sins,Powerful Spiritual Remedies to Clear Bad Karma,Can You Reduce the Sins of Your Past Life,Heres What You Should Do,How to Get Rid of Past Life Karma

 

google-ad-img