శ్రీకాకుళం భీమేశ్వరాలయం

(Srikakulam Bheemeswaralayam)

 

శ్రీకాకుళం లోని భీమేశ్వరాలయం అతి ప్రాచీన దేవాలయం. భీమేశ్వరాలయాన్ని శ్రీముఖ లింగం అని కూడా అంటారు. పురాణాల్లో భీముడు ప్రతిష్ఠించిన దేవాలయం అంటూ వర్ణించారు.

 

ఒకే పీఠంపై రెండు నందులు దర్శనమిస్తాయి. ఈ విశిష్టత మరెక్కడా కనిపించదు. అంతకంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సంగతి ఏమంటే, ఇందులో ఒక నంది విగ్రహాన్ని ఆంధ్ర శిల్పులు, రెండవ నంది విగ్రహాన్ని ఒరిస్సా వాసులు మలచారు. ఆంధ్రా, ఒరిస్సా రాష్ట్రాల మధ్య మైత్రీ భావానికి భీమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన నందులు ప్రతీకలు అంటే అతిశయోక్తి కాదు. కనుకనే వాటికి తెలుగు నంది, ఒడ్డు నంది (ఒరిస్సా నంది) అనే పేర్లు స్థిరపడ్డాయి. ఇలా రెండు రాష్ట్రాలకు చెందిన శిల్పులు చెక్కిన నంది విగ్రహాలు ఉండటం వల్ల ఇటు ఆంధ్రులు, అటు ఒరిస్సా వాసులు కూడా ఈ భీమేశ్వరాలయాన్ని దర్శించుకుంటారు.

 

నిత్య పూజలతోబాటు పండుగలు, విశిష్ట దినాల్లో ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.

 

శ్రీకాకుళం భీమేశ్వరాలయాన్ని కళింగులు నిర్మించారని కొందరు వాదిస్తుంటే, వేంగీ చాళుక్యులు నిర్మించారని మరికొందరు వాదిస్తుంటారు. మొత్తానికి భీమేశ్వరాలయంలో చోళుల నాటి శిల్పకళ దర్శనమిస్తుంది.

 

Bheemeswaralayam in Srikakulam, Srimukha Lingam in Srikakulam, Two Nandi Vigrahas in Bheemeswaralayam, Bheemeswara Kshetram


More Punya Kshetralu