ప్రాప్తం లేకపోతే

 

ఎట్టుగఁబాటు పడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగా నేరవు నిబద్ద సురావళిఁగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్పడలిఁగవ్వము చేసి మథించి రంతయున్
వెట్టియెకాక యే మనుభవించిరి వా రమృతంబు భాస్కరా!

ప్రాప్తం లేకపోతే ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కదు. మంధర పర్వతాన్ని కవ్వంగా మార్చుకుని, వాసుకిని తాడుగా చేసుకుని, దేవతలతో కలిసి అమృతం కోసం సాగరాన్ని మధించారు రాక్షసులు. కానీ ఏం ప్రయోజనం? ఆ వెట్టి చాకిరీ అంతా వృథానే కదా!


More Good Word Of The Day