ద్వారకాధీశుడి ఆలయం

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

ద్వారకాధీశ్ మరియు ద్వారక రాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఆలయమే ద్వారకాధీశ్ అనే హిందూ దేవాలయం. గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయనిర్మాణం చారిత్మాతకమైన ద్వారకా నగరనిర్మాణం తరువాత నిర్మించబడినదని విశ్వసించబడుతున్నది. మహాభారత యుద్ధానంతరం, శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత శ్రీకృష్ణుని రాజ్యం సముద్రంలో మునిగి పోయింది. ప్రధాన ఆలయమైన జగత్ మందిర్ లేక నిజ మందిర్ ఆలయం 17 మూలస్థంభాల ఆధారంగా 5 అంతస్థులతో నిర్మించబడి ఉన్నది.

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

ఈ ఆలయ నిర్మాణం జరిగి 2,500 ఏళ్లు అయిందని అంచనా. వల్లభాచార్యుడు మరియు విఠల్‌నాథ్‌జీ ల మార్గనిర్దేశకత్వంలో పూజాదికాలు నిర్వహించబడుతున్న ఈ ఆలయం పుష్టిమార్గ ఆలయాలలో ఒకటి. ప్రస్తుత ఆలయం క్రీ.శ 16వ శతాబ్దంలో నిర్మించబడింది. మూల ఆలయనిర్మాణం శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాభుని చేత హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం) ఉన్న ప్రదేశంలో నిర్మించబడిందని విశ్వసించబడుతున్నది. ఈ ఆలయం భారదేశంలోని పవిత్రమైన చార్‌ధాం హిందూ భక్తియాత్రలో ఒకటిగా భావించబడుతుంది. అధ్యాత్మికవాది, సంస్కర్త అయిన 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయంలో కూడా ఒక మందిరం ఈ సందర్భానికి గుర్తుగా నిర్మించబడి శంకరాచార్యునికి అంకితం చేయబడి ఉన్నది. దివ్యప్రబంధాలలో సూచించబడిన విష్ణుభగవానుని 108 దివ్యప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి.

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

పేరువెనుక చరిత్ర

పేరులో మొదటి భాగం ద్వారక అనేది నగరాన్ని సూచిస్తుంది. ఆది అనేది మొదటి అనేది సూచిస్తుంది. మొదటి వాడు భగవంతుడు కనుక దానికి అధిపతి ఆధీశుడు అయ్యాడు. ద్వారకానాధుని ఆలయం కనుక ఈ ఆలయం ద్వారకాధీశ్ అయింది.

చరిత్ర

ద్వారకా నగరం మహాభారత కాలంలో గోమతీ నదీ తీరంలో నిర్మించబడినట్లు పురాణాలు వర్ణిస్తున్నాయి. పురాణకాల పురాతన నగరమైన ఈ నగరం భగవంతుడైన శ్రీకృష్ణుని రాజధాని నగరంగా ఉంటూ వచ్చింది. పురాతన నగరం సముద్రంలో మునిగి పోయినట్లు గుర్తించబడింది. సముద్రాంతర్భాగ పరిశోధనలు ఈ విషయాన్ని ధృవపరిచాయి.

నిర్మాణ శైలి

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

క్రీ.పూ 400 సంవత్సరంలో శ్రీకృష్ణుని మునిమనుమడైన వజ్రనాభుని చేత నిర్మించబడిందని విశ్వసించబడింది. అయినప్పటికీ ప్రస్తుత నిర్మాణం క్రీ.శ 16వ శతాబ్ధంలో అచ్చమైన చాళుక్యుల శైలిలో నిర్మించబడింది. ఈ అద్భుత ఆలయం ఎత్తు 51.8 మీటర్లు. జగత్ మందిర్ అని కూడా పిలువబడుతున్న ఈ ఆలయానికి రెండు శిఖరాలు ఉన్నాయి. నిజశిఖరం అనబడే పెద్దశిఖరం గర్భాలయంలో శ్రీకృష్ణుడు ప్రతిష్టించబడి పూజలు అందుకుంటున్నాడు. ఈ బృహత్తరమైన ఆలయంలో అద్భుతమైన శిల్పకళానైపుణ్యం కలిగిన 60 స్తంభాలు, అనేకశిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు ద్వారకను తరువాత కాలంలో పాలించిన వివిధ గుప్తులు, పల్లవులు మరియు చవద సామ్రాజ్యాలకు చెందినవని భావించబడుతుంది.

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

ఆలయానికి ఉత్తరాన ఉన్న ద్వారాన్ని మోక్ష ద్వారం అని పిలుస్తారు. దక్షిణ ద్వారం స్వర్గ ద్వారం అని పిలువబడుతుంది. పురాణకథనాన్ని అనుసరించి ఈ ఆలయం విశ్వకర్మ చేత ఒక్కరోజులో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. 2.25 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం చెక్కడానికి మెరిసే నల్లరాయి ఉపయోగించబడింది. భగవానుడి నాలుగు చేతులలో ఒకదానిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో గద, నాలుగవ చేతిలో తామర పుష్పం ఉన్నాయి. ఈ విగ్రహాన్ని శంఖ, చక్ర, గదా, పద్మ చతుర్భుజి అంటారు. శత్రువుల దాడి నుండి రక్షించడానికి ఈ విగ్రహం సంవత్సరాల కాలం దాచి ఉంచబడింది. మధ్యకాలంలో రుక్మిణీ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ప్రస్తుత ఆలయం నిర్మించబడిన తరువాత అసలైన విగ్రహం ప్రతిష్టించబడింది.

ఆలయ ప్రత్యేకతలు

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

ద్వారకాధీశ్ ఆలయంలో ప్రవేశించే మెట్లు ద్వారక

సూర్యచంద్రుల చిత్రాలు కలిగిన జండా గోపురం మీద ఎగురుతూ ఉంటుంది.
చిహ్నం మాత్రం అలాగే ఉన్న జండాలు ఒక రోజులో ఐదు మార్లు మార్చబడుతూ ఉంటుంది.
ఆలయపరిసరాలలో జరుగుతున్న విశేషపరిశోధనలు, విలువైన ఆలయనిర్మాణం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించపడుతూ ఉంది.
ఈ ఆలయం నిర్మాణంలో రెండు సంప్రదాయాలు చోటు చేసుకున్నాయి. ద్వారకాధీశ్ ఆలయం శైవసంప్రదాయంలో నిర్మితమై ఉంది. బెట్ ద్వారకలోని ఆలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మితమై ఉంది.

ఇతర ప్రాముఖ్యతలు

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

ఆలయం ఎత్తు 78.3 మీటర్లు.
సున్నపురాయితో నిర్మించబడిన ఈ ఆలయం ఇంకా చెక్కుచెదర కుండా ఉన్నది.
ఆలయం నిర్మాణంలో ఈ భూమిపాలించిన సాంరాజ్యాల నిర్మాణశైలులన్నీ చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఆలయవైశాల్యంలో మాత్రం మార్పు చేయబడలేదు.
శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశంలో శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాభుని చేత ఈ ఆలయం నిర్మించబడిందని విశ్వసించబడింది.
జగత్ మందిర్ లేక నిజమందిర్ అనబడే పవిత్రాలయ నిర్మాణం జరిగి 2,500 సంవత్సరాలు అయిందని అంచనా.
ఆలయ ఉత్తర ద్వారాన్ని మోక్ష ద్వారం, దక్షిణ ద్వారాన్ని స్వర్గ ద్వారం అంటారు.
ఆలయం వెలుపలి ద్వారం నుండి 56 మెట్లు దిగువన గోమతీ నది ప్రవహిస్తుంది.

చార్ ధాం

Dwarkadheesh Temple is situated in Dwarka and Dedicated to Lord Krishna. Dwarkadheesh temple is built by lord krishna's grand son in 400 BC.

పవిత్రమైన చార్ ధాం ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. నాలుగు పవిత్ర ఆలయాలు రామేశ్వరం, బద్రీనాథ్, పూరి మరియు ద్వారక. ఆధారపూరితం కానప్పటికీ ఇక్కడ అద్వైత పాఠశాల హిందూ సన్యాస సంస్థలను దేశమంతటా స్థాపించిన శంకరాచార్యుల చేత ఆరంభించబడిందని విశ్వసిస్తున్నారు. నాలుగు చార్ ధాం ఆలయాలు దేశం నాలుగు మూలలలో స్థాపించబడ్డాయి. బద్రీనాథ్ దేశానికి ఉత్తరదిశలోనూ, జగన్నాథ్ ఆలయం తూర్పున పూరీ నగరం లోనూ, రామేశ్వరం ఆలయం దేశానికి దక్షిణంలో ఉన్న రామేశ్వరం లోనూ , పడమరలో ద్వారకాపురిలో ద్వారకాధీశ్ ఆలయం ఉన్నాయి. దేశానికి నాలుగు చెరగులా ఉన్న ఆలయాలు సిద్ధాంతపరంగా శైవ, వైష్ణవ మతాలకు ప్రతీకగా హిందూ సాంప్రదాయక యాత్రకు లక్ష్యాలుగా ఉన్నాయి. అయినప్పటికీ హిమాలయాలలో మరి ఒక చిన్న చార్ ధం యాత్ర ఉన్నది. అవి వరుసగా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి మరియు యమునోత్రి. ఇవి అన్నీ హిమాలయ శిఖరాలలో ఉన్నాయి. అసలైన చార్ ధాం నుండి వైరుధ్యం చూపడానికి వీటిని చోటా(చిన్న) చార్ ధం అంటారు. 20వ శతాబ్దపు మధ్యకాలంలో ఈ చోటా చార్ ధాం పిలువబడుతూ ఉంది. హిందువులు జీవితకాలంలో ఒక సారి ఈ ఆలయాలను దర్శించాలని లక్ష్యంగా పెట్టుకోవడం సాధారణం. సంప్రదాయకంగా ఈ యాత్ర పూరీ జగన్నాథ్ ఆలయదర్శనంతో మొదలై గడియారపు భ్రమణదిశగా సాగడం అలవాటు.

More Punya Kshetralu