• Prev
  • Next
  • వాడు నిన్ను చూడటం మానేస్తాడు

    వాడు నిన్ను చూడటం మానేస్తాడు

    హైదరాబాద్ లో ఉంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు తల్లికూతుర్లిద్దరు. రైలు

    సరిగ్గా రాజమండ్రి ప్లాట్ ఫాం మీదకు వచ్చి ఆగింది. పది నిమిషాల తరువాత తల్లితో

    కూతురు భోగీలోంచి బయటికి చూస్తూ అంది.

    " అమ్మా...అక్కడి బెంచి మీద కూర్చున్న ఉంగరాల జుట్టు కుర్రాడు నన్ను చూసి

    నవ్వుతూ వెకిలి చేష్టలు చేస్తున్నాడు " అని.

    " ఈ కుర్రాళ్ళందరూ అంతేనమ్మా ! అయినా నువ్వు అసలు వాడి వైపు చూడకు. వాడూ

    నిన్ను చూడటం మానేస్తాడు " అని తల్లి చెప్పింది.

    కాసేపటి తరువాత మళ్ళీ కూతురు తల్లితో " ఆ కుర్రాడు ఇంకా నన్నే చూస్తున్నాడమ్మా "

    అని అన్నది.

    " నిన్ను అటువైపుగా చూడవద్దని చెప్పాను కదా " అని తల్లి కొంచం కోపంగా అంది.

    " నేను చూడటం లేదు. కాని ఆ కుర్రాడు మాత్రం నన్ను చూస్తున్నాడు " అని చెప్పింది

    కూతురు.

    " ఇది చూస్తేనే వాడు దీనిని చూస్తున్నాడు అని తెలిసేది. ఇది కూడా తెలియని

    అమాయకురాలు నా కూతురు " అని దగ్గరికి తీసుకుంది తల్లి.

  • Prev
  • Next