TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
మా విహారయాత్రకు బ్రేకు లేదు
కొందరు యాత్రికులు బస్సులో విహారయాత్రకు బయలుదేరారు.
అందరు కేరింతలు కొడుతూ ఉల్లాసంగా పాటలు పాడుకుంటున్నారు.
డ్రైవర్ మాత్రం దిగులుగా ఉన్నాడు.
అది గమనించిన ఒక యాత్రికుడు " మేం అందరం ఆనందంగా ఉంటుంటే నీవేంటి అలా
దిగులుగా ఉన్నావు. నీవు కూడా ఒక మంచిపాట పాడు " అని సంబరంగా అన్నాడు.
" ఆగదూ..ఆగదూ...మరణం తథ్యమని చెప్పినా మృత్యువూ ఆగదూ..." అని బాధగా
పాడుతుంటే, పాట మధ్యలో కలిపించుకున్న ఆ యాత్రికుడు వెంటనే " ఏంటయ్యా అలాంటి
పాట పాడుతావు ? " అన్నాడు కొంచెం కోపంగా.
" మరి ఏమి చేయమంటారు సార్ ! బ్రేకులు ఫెయిలయి నే చస్తుంటే.." అని గబుక్కున
నాలిక్కరుచుకున్నాడు ఆ డ్రైవర్.
" ఆ..." అని అందరు అయోమయంలో పడ్డారు.