• Prev
  • Next
  • భార్య ఇచ్చిన పెళ్ళికానుక

    భార్య ఇచ్చిన పెళ్ళికానుక

    '' వచ్చేవారం మనపెళ్ళి రోజు కదా ! " అని భర్తతో భార్య అంది.

    " అవును..అయితే " అన్నాడు భర్త.

    " ఆ రోజు మీకో గమ్మత్తయిన కానుక ఇవ్వాలని అనుకుంటున్నాను " అని సిగ్గుపడుతూ

    చెప్పింది భార్య.

    " ఏమిటో ఆ గమ్మత్తయిన కానుక " అని కాస్త వెటకారంగా అన్నాడు భర్త.

    " అదే సస్పెన్స్ " అని చెప్పి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది ఆ భార్య.

    ఆ గమ్మత్తయిన కానుక ఏమై ఉంటుందా అని ఆతృతగా ఎదురుచూడ సాగాడు ఆ భర్త.

    పెళ్లిరోజు రానే వచ్చింది. ఆ భార్య ఏమి మాట్లాడకుండా ఒక కోతిపిల్లని తెచ్చి భర్తకు

    ప్రజంట్ చేసింది. దాంతో ఏమి చేయాలో అ భర్తకు అర్థంకాక అయోమయంగా చూస్తూ

    ఉండిపోయాడు.

  • Prev
  • Next