• Prev
  • Next
  • నేనూ - వచన కవిత్వం - 5

    Listen Audio File :

    నేనూ - వచన కవిత్వం - 5

    - మల్లిక్

     పిచ్చుమణి మళ్ళీ చెప్పడం మొదలుబెట్టాడు.

        "సీజన్ బట్టి కవిత్వం రాయాలి. ఉగాది వచ్చిందనుకో... వచ్చింది ఉగాది అంటూ రాసెయ్యాలి.. ఎండాకాలం

    వస్తే ఎండలు ఎండలు, మండే ఎండలు అంటూ రాసి పడెయ్యాలి. అంతేకాదు, ఎప్పుడూ ఇలాంటి కవిత్వమే రాస్తే

    నీకు సామాజిక స్పృహ లేదని అంటారు. అందుకే రిక్షావాడి మీద, గుడిసెల్లో ఉండేవాళ్ళమీద "ఓ పేదవాడా...

    నువ్వుండేది మురికివాడా" అంటూ కవిత్వం రాయ్. వీలున్నప్పుడల్లా చంపుతా, నరుకుతా అను"

        "అదేమిటండీ!" ఆశ్చర్యపోతూ అడిగాను.
     
    "దాన్ని విప్లవ కవిత్వం అంటారు. ఇహపోతే మినీ కవితలు గురించి, మన రాజధాని గోడలమీద చూడు... ఎన్ని

    స్లోగాన్లో... ముందు అవి బాగా చదువు. అవన్నీ మినీ కవితలే..."

    'బస్సులో వెళ్లేటప్పుడు నేను రోజూ వాటిని చదువుతానండీ" అన్నాను.

        "ఏదీ.. అయితే ఆ అనుభవంతో ఒక మినీ కవిత ఆశువుగా చెప్పుచూద్దాం."

        "కవిత్వం రాయడంలోనే అనుభవం లేదు. ఒక ఆశువుగా ఎలా చెప్పగలనండీ" నసిగాను.

        "ఓరి నీ అమాయకత్వం కూలా హ్హహ్హహ్హ...దీని తస్సచెక్క... మళ్ళీ క్రింద పడిపోయిందయ్యా..."

        క్రిందనుండి కట్టుడు పన్ను తీసి పెట్టుకున్నాడు.

        "మినీ కవిత్వం రాయడానికిగానీ ఆశువుగా చెప్పడానికిగానీ అనుభవం కావాలటయ్యా...ఇప్పటికిప్పుడు నె

    చెప్తా చూడు..."

        ఓసారి దువ్వెనతో వీపు గోక్కుని

        "బడికి వెళ్తే బలపం

        గుడికి వెళ్తే గిల్పం" అన్నాడు.

        "గిలపం అనే పదం లేదు. కానీ ప్రాసకోసం మనం అలా అంటాం. దానికి ప్రేక్షకులు లేదా పాఠకులు

    కర్పూరంగా అర్థం చెప్పుకుంటారు. అలా మనకి కొన్ని కొత్త పదాలు సృష్టించే స్వేచ్ఛ ఉంది.

        నాకు హుషారు పుట్టింది.

        "నేను కూడా ఓ మినీ కవిత చెప్తానండీ"అన్నాను.

        "చెప్పు చెప్పు"

        "ఇడ్లీకి జత సాంబారు"

        దేవదాసుకి జత బీరు బారు" అన్నాను బుర్ర గోక్కుంటూ.

        పిచ్చుమణి చప్పట్లు కొట్టాడు.

        "నీకు కవిత్వం ఎలా రాయాలో అర్థం అయిపోయిందయ్యా. ఇంక నేను చెప్పేది ఏముంది?"

      నేను కుర్చీలోంచి లేచాను.

        "మరో విషయం. నువ్వు కాస్త మంచి కవిని అనిపించికోవాలంటే నాలా ఇలా సిల్కు లాల్చి వేసుకుని, మీద

    కాశ్మీరు శాలువా కప్పుకోవాలి" అన్నాడు.

        "అలాగేనండీ" వినయంగా తల ఊగించాను.

        పిచ్చుమణి ఇంట్లోపలికి చూస్తూ "ఓసేవ్ ముండా... ఈ పెద్దలమ్డీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? చిన్న ముండా

    కొడుకు ఇందాకనగా నా సిగరెట్లు తేడానికి వెళ్ళాడు. ఇంకా ఇంటికి చాపలేదా? పనిమనిషి ఈవేళ రాలేదన్నావు?

    కాలెండర్లో గుర్తు పెట్టుకుని ఫస్టుకి దాని జీతం కట్ చెయ్... దానెమ్మ..."

        నేను బికచచ్చిపోయాను. హఠాత్తుగా పిచ్చుమణీకి ఏమైంది?...

        పిచ్చుమణి నావైపు తిరిగి "మరేమీ అనుకోకోయ్... కవిత్వం విషయం మాట్లాడేటప్పుడే నేను మామూలుగా

    మాట్లాడతాను. మిగతా టైమంతా నేను మాట్లాడేది ఈ భాషే... హహహ..."

        క్రిందకి వంగాడు కట్టుడు పన్ను తీసుకోవడం కోసం.

        "నేనిహ వస్తానండీ!..." అన్నాను అయోమయంగా.

        "మంచిది" అన్నాడు పన్ను తగిలించుకుంటూ పిచ్చుమణి.

        నేను గుమ్మం దాటగానే నా వెనకాల తలుపులు ధబేల్ అని మూసుకున్నాయ్.

        "మాయదారి సంత.. ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తారు" అన్న మాటలు తలుపులు మూసుకోడానికి క్షణం

    ముందు వినిపించాయి నాకు.

  • Prev
  • Next