• Prev
  • Next
  • నమ్మకంతో దొరికిపోయిన దొంగ

    నమ్మకంతో దొరికిపోయిన దొంగ

    డబ్బు కోసం బ్యాంకులో దొంగతనం చేయాలనుకున్నాడు గిరి.

    లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్లాడు.

    అక్కడ ఆ లాకర్ మీద " దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే

    ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు " అని రాసుండటంతో ఆలస్యం చేయకుండా ఆ పని

    చేశాడు గిరి.

    వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది.

    అలారం మోగింది.

    దాంతో పోలిసులకు దొరికిపోయాడు.

    వ్యాన్ లో తీసుకెళ్తుంటే " హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం

    చేయడం మామూలైపోయింది " అనుకున్నాడు విచారంగా.

  • Prev
  • Next