• Prev
  • Next
  • తినలేను బాబూ!

     

    తినలేను బాబూ!

    ఒక పెద్దావిడ బస్సులో ప్రయాణం చేస్తోంది. ప్రయాణం చేస్తున్న మనిషి ఊరికనే ఉండలేదు. తన చేతిసంచిలోంచి కాసిన బిస్కెట్లు తీసి పక్కనే ఉన్న కుర్రవాడికి ఇచ్చింది. ముసలావిడ పెద్ద మనసు చూసిన కుర్రవాడు కరిగిపోయాడు.

    ‘అదేంటి బామ్మగారూ! బిస్కెట్లన్నీ నాకే ఇచ్చేశారు. మీరు తినరేం?’ అని అడిగాడు కుర్రవాడు మాటలు కలుపుతూ.

    ‘అబ్బే! నా పళ్లన్నీ పాడైపోయాయి నాయనా. బిస్కెట్లు కొరకలేను!’ అంటూ జాలిగా జవాబు చెప్పింది పెద్దావిడ.

    ‘మీరెంత మంచివారు బామ్మగారూ! మీరు తినలేకపోయినా, నాలాంటి వాళ్ల కోసం బిస్కెట్లు కొంటున్నారా?’ అని పొగిడాడు కుర్రవాడు.

    ‘అదేం లేదులే నాయనా! ఏదో బిస్కెట్లకి ఉండే క్రీం కోసమని వాటిని కొనుక్కుంటాను. నా పనైపోయాక నీలాంటి వాళ్లకి ఇచ్చేస్తుంటాను’ అంటూ బదులిచ్చింది బామ్మగారు.

  • Prev
  • Next