• Prev
  • Next
  • జీవితాన్ని బలికోరిన ప్రేమ త్యాగం

    జీవితాన్ని బలికోరిన ప్రేమ త్యాగం

    " నీ కోసం ఏ త్యాగమైన చేస్తాను రాధ " అని ప్రేమగా అన్నాడు గోపి.

    " థాంక్స్ గోపి... నా అందం చూసి నన్ను ఎవరైనా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి

    చేసుకుంటారు. కాని మా అక్కకి ఎత్తు పళ్ళు, మెల్ల కన్ను, సోట్టముక్క, కుంటికాలు

    చూసి ఎన్నో సంబంధాలు వెనక్కి పోతున్నాయి. కాబట్టి నా కోసం మా అక్కను పైసా

    కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని మాటివ్వు గోపి " అని చెప్పుతూ తన

    కుడిచేతిని ముందుకు చాపింది రాధ.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గోపి.

     

  • Prev
  • Next