• Prev
  • Next
  • అఖిలభారత విచారం తొలిగించే సంఘం

    అఖిలభారత విచారం తొలిగించే సంఘం

    " నువ్వు అఖిలభారత విచారం తొలిగించే సంఘం పెట్టావట కదా ! అందులోని

    ముఖ్యాంశాలు ఏమిటి ? " అని అడిగాడు దారిలో వెళ్తున్న వెంకన్నని

    అంజిబాబు.

    " ఎన్నికలలో ఓడిపోయినా వారిని మరోసారి గెలుస్తారని సముదాయిస్తాం.

    ఒలంపిక్స్ లో మెడల్స్ రానివారికి వచ్చేసారి మెడల్స్ వస్తాయని నచ్చచెబుతాం.

    భార్యల చేత చివాట్లు తిన్న భర్తలను ఓదార్చడం..." అంటూ చెప్పుతూనే ఉన్నాడు

    వెంకన్న.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు అంజిబాబు.


  • Prev
  • Next