• Prev
  • Next
  • Telugu Jokes

    తెలుగు జోక్స్

    ***********************************************************************

    అప్పు

    "ఒరేయ్ రామూ, నేను మీ నాన్నగారికి రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చి నెలకు రెండు

    వందలు చొప్పున తీర్చమన్నాననుకో అప్పుడు ఎన్ని నెలలలో నేను ఇచ్చిన అప్పు

    తీరుతుంది ?” అడిగింది లెక్కల టీచర్.

    ”అసలు తీరదు మేడం"అన్నాడు రాము.

    ” ఇంత చెప్పీనా నీ బుర్రకు ఏమీ ఎక్కడం లేదు.నీకు లెక్క అసలు అర్ధమవుతున్నాయా

    లేవా ? కోపంగా అడిగింది టీచర్.

    ”మీకే మా నాన్న తత్వం అర్ధం కాదు మేడం. అప్పు చేయడమే గాని తీర్చే బుద్ధి మా

    నాన్నగారికి అసలు లేదు"అసలు సంగతి చల్లగా చెప్పాడు రాము.

    **********************************************************************

    భీమా ఏజన్సీ !...

    “ఇంతకముందు మీ నాన్నగారి పేరు రామారావు అని చెప్తుండేవాడివి, ఇప్పుడు భీమారావు

    అని చెబుతున్నావే౦?”అడిగాడు రవి.

    “అయన భీమా ఏజన్సీతీసుకున్నప్పటి నుండి అన పేరుని భీమరావుగా మార్చకున్నాడు

    మరి"చెప్పాడు గిరి.

    **********************************************************************

    పట్టుదల

    “పట్టుదల ఉంటే మనిషి సాధింలేనిది లేదోయ్ "అన్నాడునరసింహం.

    “అలాగా…. అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో

    నింపండి చూద్దాం"అన్నాడు జయదేవ్.

    ***********************************************************************

    భయం

    “నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి

    ఉంచుతాను”"చెప్పాడు అప్పారావు.

    “ఏం…. మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?”అడిగాడు

    వెంకటయ్య .

    “కాదు….. నన్ను తోసేస్తుందని.”అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకున్నాడు.

    **********************************************************************

    బుద్ధి...!

    “మా ఆయన్తో చచ్చే చావొచ్చిపడింది. 60 సంవత్సరాలు వచ్చిన అయన చిన్నపటి బుద్ధిని

    పోనిచ్చుకోవట్లెదు!” వాపోయింది అనసూయ.

    “అంటే ఏం చేస్తున్నాడేమిటి ?”అడిగింది అన్నపూర్ణ.

    “నా మొహం కనబడి కనబగానే ఏడుపు లంకించుకుంటున్నారు "అని చెప్పింది రమ.

    ***********************************************************************


  • Prev
  • Next