• Prev
  • Next
  • Telugu Comedy Kavithalu

    Telugu Comedy Kavithalu

    తెలుగు కామెడీ కవితలు



    భర్త

    పెళ్ళయిన కొత్తలో

    ఏదడిగినా కొని పెడతాడు

    కొన్నాళ్ళయ్యాక

    ఏదడిగినా విసుక్కొని పెడతాడు



    మా పేటలో చేసారు ఇద్దరు దోస్తి

    ఊరంతా చేసారు మస్తీ

    వాళ్ళన్న తిరిగాడు గస్తీ

    వన్ ఫైన్ డే ఇద్దరు పడ్డారు కుస్తీ

    మీ ప్రాస విని మేమయ్యాము సుస్తీ

    మీరు వదిలేస్తే మేము వెళతాము బస్తీ



    ఓట్లు అడగడానికి ముందు

    మరిచిపోతారు

    గతంలో చేసిన పొరపాట్లు

    ఎన్నికయ్యాక పదవి కోసం పడతారు

    నానా రకాల పాట్లు !

    ఎన్నికయ్యాక ఇంకేముంది

    కుర్చీలో కునుకుపాట్లు !!



    చంద్రముఖి అప్పుడప్పుడు అంటుంది

    లక లక లక లక

    ప్రొద్దున్నే చేసుకోవాలి పనులన్నీ

    చక చక చక చక

    కప్పలకు మూడ్ వస్తే అరుస్తాయి

    బెక బెక బెక బెక

    ఇలా ఎన్నైనా చెప్పగలను

    టక టక టక టక టక

    అక టక టక టకటా

    నీ కవితలు మా చెవిలో కట కట కట కట

    మేం తాగి చస్తాం విషం గట గట గట గట

    నీ పళ్ళు ఊడుతాయి పట పట పట పట


  • Prev
  • Next