• Prev
  • Next
  • Navvule-Navvulu 15

    నవ్వులే నవ్వులు - 15

    ***********************************************************************

    అదిరిపడిన పెళ్ళికొడుకు

    పెళ్లి చూపులు జరుగుతున్నాయి.

    “మీ అమ్మాయికి వంటోచ్చా?”అడిగాడు అబ్బాయి తండ్రి,అమ్మాయి తల్లిదండ్రులని.

    “ఓ...మా అమ్మాయి అన్ని రకాల వంటల్నీ చాలా రుచిగా వండుతుంది "చెప్పింది

    అమ్మాయి తల్లి.

    “కుట్లూ,అల్లికలు ?”అడిగింది అబ్బాయి తల్లి.

    “అన్ని రకాల కుట్లూ అల్లికలు వచ్చు "అమ్మాయి తల్లి సమాధానం.

    “సంగీతం వచ్చా ?”అబ్బాయి అడిగాడు.

    “ఓ...మా అమ్మాయికి అన్ని కీర్తనలూ వచ్చు "హుషారుగా అంది అమ్మాయి తల్లి.

    “అయితే సంబంధం కాన్సిల్ "అరిచాడు అబ్బాయి.

    "ఆ..." అందరూ ఆశ్చర్యంగా నోరు తెరిచారు.

    **********************************************************************

    ఇంకాస్త బాగా నేర్చుకోవాలి

    డోర్ బెల్ మోగింది.

    రామనాథం తలుపు తీశాడు.

    ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

    “క్షమించండి..నేను ఈ పక్క ఇంట్లోకి మూడు రోజుల క్రితం కొత్తగా వచ్చాను.మీ ఇంట్లో రోజూ సంగీతం పాడేది ఎవరండీ ?”అడిగాడు ఆ వ్యక్తి.

    “మా ఆవిడండీ.ఏం మీ పిల్లలకి సంగీతం నేర్పించమని అడగటానికి వచ్చారా ?”అడిగాడు రామనాథం.

    “కాదు...ఆవిడనే ఇంకాస్తా బాగా నేర్చుకుని పాడమని చెప్పడానికి వచ్చా ?”చెప్పాడు వచ్చిన వ్యక్తి.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రామనాధం.

    ***********************************************************************

    పదివేల చెక్ ప్రేమ

    రమ,ఉమ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా పోస్టుమాన్ వచ్చి ఓ కవర్ ఇచ్చి వెళ్లాడు.కవర్ మీద చేతి వ్రాత చూసి "ఓ...మా ఆయన నుండి వచ్చింది "అని కవరును చింపి చిన్న కాగితం చూసి మళ్ళీ కవర్లో పెట్టేసింది ఉమ.

    “మా ఆయన బిజినెస్ చాలా బాగా సాగుతుందట...ఆయనకి నేనంటే ఎంతో ప్రేమట...!”అంది.

    “నువ్వు కాగితం వంక ఒక్క క్షణం కూడా చూళ్ళేదు.అప్పుడే ఉత్తరం అంతా ఎలా చదివేశావ్ ?” ఆశ్చర్యంగా అడిగింది ఉమ.

    “అది ఉత్తరం కాదు.పదివేలకు చెక్ "అని పకపక నవ్వింది ఉమ.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయింది రమ.

    ***********************************************************************

    మతిమరుపు జోగారావు

    మతిమరుపు జోగారావు మోటార్ సైకిల్ మీద స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.స్నేహితుడితో కాస్సేపు మాట్లాడి తను మోటారు సైకిల్ మీద వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

    ఇంటి దగ్గర మోటార్ సైకిల్ గురించి భార్య అడిగితే తప్ప అతనికి గుర్తు రాలేదు తన మోటార్ సైకిల్ మీద వెళ్ళిన సంగతి. కంగారుగా స్నేహితుడి ఇంటికి పరుగెత్తుకుని వెళ్లాడు.ఆ మోటారు సైకిల్ ఇందాక తనేక్కడ పెట్టాడో అక్కడే క్షేమంగా ఉంది.

    తన మోటారు సైకిల్ పోనందుకు ఆ పక్కనే వున్నా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా మొక్కుకుందామని అనుకుని గుళ్ళోకి వెళ్లాడు.దేవుడికి మొక్కుకుని గుళ్ళో నుంచి బయటికి వచ్చిన జోగారావు గుండెలు బాదుకున్నాడు. అక్కడ అతని మోటారు సైకిల్ లేదు.

    ***********************************************************************

    సుబ్బారావు అదృష్టం

    సుబ్బారావు మరణించాడు. దూతలు వచ్చి అతన్ని స్వర్గలోకానికి తీసుకెళ్ళారు. సుబ్బారావు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

    “ఓహ్...స్వర్గలోకం!ఏంటి నేనంత పుణ్యం చేసుకున్నానా ?అసలు పాపాలే చెయ్యలేదా ?”అడిగాడు దూతల్ని.

    “ఎందుకో చెయ్యలేదు..అసలు నిన్ను నరకానికే తీసుకెళ్ళాలి.కానీ నువ్వు చేసిన పాపాలన్నింటికీ శిక్షని నువ్వు భూలోకంలోనే మీ ఆవిడతో కాపురం చేస్తున్నప్పుడే అనుభవించావు.అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం ?”అని చెప్పారు దూతలు.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్బారావు.


  • Prev
  • Next