• Prev
  • Next
  • Latest Telugu Funny Jokes

    అల్లరి విద్యార్థి:

    విద్యార్థి: నిన్న ప్రమీల క్లాసులో నిద్రపోయింది మేడమ్...
    టీచర్: మరి నిన్ననే ఎందుకు చెప్పలేదురా బడవా...
    విద్యార్థి: అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు మేడమ్..!!

    భర్త వుండగా..పని మనిషి దండగా:   


    "మీ ఇంట్లో పని మనిషి లేదన్నారుగా..!
    అయినా మీ ఒళ్ళు కాస్త కూడా తగ్గలేదేమిటి..?" లక్ష్మీని ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్.
     
    '' పని మనిషి లేదన్నాను కానీ..
     మా ఆయన లేరని చెప్పలేదుగా డాక్టర్'' అంటూ బదులిచ్చింది లక్ష్మీ.

    మేకప్ మేస్త్రి :

    హీరో : నా దగ్గర మేకప్ మెన్‌గా పని చేస్తానంటున్నావు, అనుభవం ఉందా?
    పుల్లయ్య : 'ఉందండి. గత పదేళ్లుగా తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నా. ఆ అనుభవం చాలాదా'!

  • Prev
  • Next