• Prev
  • Next
  • హలో... రాంగ్ నెంబర్.! - 69

    Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

     

    హలో... రాంగ్ నెంబర్.! - 69

     

    ముచ్చర్ల రజనీ శకుంతల

     

    భర్త నిద్రపోలేదని, కళ్ళకు రెండు చేతులు అడ్డం పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడని అర్థమయ్యేక చెప్పింది భర్తతో.

    "ఇంకా మూడు వందల అరవై రోజులుంది" శ్రీకర్ వినీవినననట్టు వూర్కున్నాడు.

    "ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు?" అడిగింది ప్రియంవద.

    "మీ ఫ్రెండ్ చెప్పలేదా?" అడిగాడు శ్రీకర్.

    "మా ఫ్రెండా?" ఎవరు?"

    "అదే..కమల..." అన్నాడు శ్రీకర్ కళ్ళ మీది నుంచి చేతులు తీయకుండానే.

    "కమలా...అదేమిటి?" గతుక్కుమంటూ మేకపోతూ గాంభీర్యంతో అడిగింది.

    "ఇందాక నీకు ఫోన్ చేసింది చూడు. ఆ ఫ్రెండ్...అన్నట్టు మీ కమల లాంగ్ కోటు వేసుకుంటుందా, మీసాలు కూడా వున్నట్టున్నాయే" అన్నాడు చేతివ్రేళ్ళ సందుల్లో నుంచి ప్రియంవద రియాక్షన్ గమనిస్తూ.

    ప్రియంవద కు అర్థమైంది. జేమ్స్ బాండ్ విషయం భర్తకు తెలిసిపోయిందని. వెంటనే అటువైపు తిరిగి పడుకుంది.

    *           *             *

    శ్రీకర్ ఉదయం ఆఫీసులోకి అడుగుపెట్టగానే లూసీ చిర్నవ్వుతో "గుడ్ మానింగ్" అంటూ విష్ చేసింది.

    "వెరీ గుడ్ మానింగ్ లూసీ...నువ్వు ఉదయమే గుడ్ మానింగ్ చెబుతూంటే ఎలా వుందో తెలుసా?"

    "ఎలా వుంది సార్?"

    "పొద్దున్నే కళ్ళు తెరవగానే సూర్యోదయం దృశ్యాన్ని చూస్తూంటే, ఎదురుగా వున్న గులాబీ గొంతు విప్పి 'శుభోదయం' అని చెప్పినట్టు వుంది."

    "థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్"

    "ఇది సిన్సియర్ ఫీలింగ్" చెప్పాడు శ్రీకర్.

    లూసీ ఆరోజు చేయవలసిన పనుల లిస్టు చెప్పుకుపోతుంది.

    "లూసీ...ఈరోజు కూడా నా 'ఎజెండా' లో ఎనిమిది గంటలకు జెన్నిఫర్ ని కలిసే విషయం చేర్చడం మరిచిపోకు.

    నిన్న ఏం జరిగిందో అడగనే లేదు" అన్నాడు శ్రీకర్.

    "నిన్న మీద నాకు ఆసక్తి లేదు సార్" అంది లూసీ.

    "పోనీ ఇవ్వాళ ఏం జరుగుతుందో అడుగు"

    "ఇవాళ్టి గురించి ఆదుర్దా లేదు సార్"

    "వెరీగుడ్...మరి రేపటి మీద..."

    "ఆశ లేదు" చెప్పింది లూసీ.

    "బావుంది. ట్రయ్ చేస్తే టీవీ సీరియల్స్ కు డైలాగ్స్ బాగానే రాయగలవు" నవ్వుతూ అన్నాడు శ్రీకర్.

    లూసీ ఏదో చెప్పబోయేంతలో  శ్రీకర్ పర్సనల్ మోబిటెల్ రింగయింది. శ్రీకర్ డిస్ ప్లేలో నెంబర్ చూసి, సెండ్ బటన్ నొక్కి అడిగాడు "చెప్పు అక్షితా ఏమిటి?" అటువైపు నుంచి చెప్పుకుపోతోంది అక్షిత.

    శ్రీకర్ మొహంలో రకరకాల ఎక్స్ ప్రెషన్స్.

    "ఓ.కె. నేను మరో అరగంటలో అక్కడుంటాను. బై" చెప్పి ఫోన్ పెట్టేసి లూసీ వైపు తిరిగి

    "అక్షిత..వెరీగుడ్ గాళ్.." చెప్పాడు.

    "అలాగా..." అని వూర్కుంది లూసీ.

    శ్రీకర్ బ్రీఫ్ కేస్ తీసుకొని, లూసీకి చెప్పాడు "నేను రావడం ఆలస్యం కావచ్చు. ప్రియంవద నుంచి ఫోన్ వస్తే, నేను ఎక్కడికి వెళ్లానన్న విషయం చెప్పొద్దు"

    "అలాగే సార్" అంది లూసీ.

    శ్రీకర్ అక్షిత యింటికి బయల్దేరాడు.

    శ్రీకర్ కారును, జేమ్స్ బాండ్ బైక్ మీద ఫాలో చేస్తున్నాడు.

    శ్రీకర్ కు మనసంతా ఫ్రీజయిన ఫీలింగ్.

    ఎందుకా ఫీలింగ్?

  • Prev
  • Next