• Prev
  • Next
  • షాకింగ్ న్యూస్

    షాకింగ్ న్యూస్

    " వదినా...! వదినా...! నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా... ఆ ఎదురింటి విమలమ్మ

    కూతురు రాత్రి ఎవడో పనికిమాలిన వెధవతో లేచిపోయిందట. " చంకలు గుద్దుకుంటూ

    సంతోషంగా చెప్పింది కమలమ్మ.

    " అంతేనా...! నీకింకా షాకింగ్ న్యూస్ చెప్పమంటావా వదినా...! ఆ విమలమ్మ కూతుర్ని

    లేపుకుపోయింది మీ అబ్బాయేనట" అని అసలు విషయం చెప్పింది రమణమ్మ.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది కమలమ్మ.

  • Prev
  • Next