• Prev
  • Next
  • మొగుడు పెళ్ళాం ఓ చమత్కారం

    తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్

    మొగుడు పెళ్ళాం ఓ చమత్కారం

    రచన - శాగంటి శ్రీకృష్ణ

    " ఏవండీ ! మిమ్ముల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నేను భరించలేనండీ " అని ప్రేమగా

    మొగుడితో అంది పెళ్ళాం.

    " నేనంటే నీకెంత ప్రేమ సౌభాగ్యం " అంటూ మురిపోయాడు ఆ మొగుడు.

    " ప్రేమా...పాడా ! అంటే నేనే అనాలి ..వేరే వాళ్లకి ఆ చాన్స్ ఎందుకిస్తాను ! "

    చమత్కారంగా అంటూ వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం.

    *********

    " ఈవిడే నా భార్య...నా ప్రాణం కూడా " అంటూ ఇంటికి వచ్చిన తన స్నేహితుడికి

    పరిచయం చేస్తున్నాడు ఒక భర్త.

    " నేనంటే నీకు ఎంత ప్రేమండీ...ఎంత మంచి భర్త మీరు " అంటూ పొంగిపోయింది ఆ

    భార్య.

    " ఆగు..ఆగు...నన్ను పూర్తిగా చెప్పనీయ్...ఈవిడే నా భార్య.. నా ప్రాణాలు తీసేది

    కూడా ఈవిడే " అని చమత్కారంగా కన్నుగీటాడు ఆ భర్త.

    మూతిని ముడువంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆ భార్య.

    ********

    " ఏవండీ మీరు మంచి ఆర్టిస్టు కదా ! మంచి డిజైన్ తో నాకు గోరింటాకు పెట్టరూ " అని

    ప్రేమగా అడిగింది భార్య.

    " భర్తలోని కళను మెచ్చుకున్న ఏకైక భార్యవి నువ్వే డియర్.." అంటూ ఆనందపడి ఆమె

    చేతులకి మంచి డిజైన్ వేశాడు ఆ భర్త.

    " అయ్యయ్యో...వంట చేయడం మరిచాను. ఈ పూటకి మీరు చెయ్యరూ " అంటూ

    రాగాలు తీసింది ఆ భార్య.

  • Prev
  • Next