నాన్నగారిని కాస్త మందలించు

నాన్నగారిని కాస్త మందలించు

" అమ్మా ! నాన్నగారిని కాస్త మందలించు " అని కిచెన్లో వంట చేసుకుంటున్న భారతి

దగ్గరికి వచ్చి చెప్పాడు కొడుకు కిరణ్.

" ఎందుకురా ? " అని ఏమి తెలియనట్టుగా అడిగింది భారతి.

" పనిమనిషిని చిన్నమ్మా అని పిలవమంటున్నాడు " అని చెప్పి అక్కడి నుండి

పరుగులు తీశాడు.

భర్త వంక గుర్రుగా చూస్తుండిపోయింది భారతి.

గుటికిల్లు మింగుతూ అలా చూస్తుండిపోయాడు భర్త.