టి.సి రుద్రయ్యతో కత్తుల రత్తయ్య

టి.సి రుద్రయ్యతో కత్తుల రత్తయ్య

“ఎక్స్ ప్రెస్ ఎప్పుడొస్తుంది సార్ ?” టి.సి.రుద్రయ్యని అడిగాడు రత్తయ్య

“ రెండింటికి " చెప్పాడు టి.సి. రుద్రయ్య.

“ ప్యాసింజర్ ఎప్పుడొస్తుంది సార్ ? " టి.సి.ని మళ్ళీ అడిగాడు రత్తయ్య.

“ మూడింటికి " ఓపికతో చెప్పాడు టి.సి.రుద్రయ్య.

“ మరి గూడ్స్ ఎప్పుడొస్తుంది సార్ ?” అడిగాడు రత్తయ్య.

“ ఇంతకీ నువ్వు ఎటు వెళ్ళాలి ?” మరింత ఓపికను తెచ్చుకుని అడిగాడు టి.సి.

“ రైలు పట్టాల అవతలకి " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రత్తయ్య.

“ ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు టి.సి.