కొంటె కొశ్శెన్లు - తుంటరి జవాబులు

కొంటె కొశ్శెన్లు - తుంటరి జవాబులు

కొంటె కొశ్శెన్ : అతి జాగ్రత్త పరుడైన షుగర్ పేషెంట్ ?

తుంటరి జవాబు : ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నా షుగర్ టెస్ట్ చేయించుకునేవాడు.

*******

కొంటె కొశ్శెన్ :కండక్టర్ ఆశ్చర్యపోయేదెప్పుడు ?

తుంటరి జవాబు :నువ్వు ఎంగిలి చేసిన తెక్కెట్లు నాకు వద్దు అని ప్రయాణం చేసేవారు అన్నప్పుడు.

******

కొంటె కొశ్శెన్ :ఫోటోగ్రాఫర్ విస్తుపోయేదెప్పుడు ?

తుంటరి జవాబు :బురఖాలు వేసుకున్న స్త్రీలు వచ్చి అందంగా ఫోటో తీయమన్నప్పుడు.

******

కొంటె కొశ్శెన్ :అసలైన అహింసవాది?

తుంటరి జవాబు :చెయ్యెత్తి జై కొట్టడానికి కూడా భయపడేవాడు.

*****

కొంటె కొశ్శెన్ :కథ చెబుతున్నప్పుడు ఎందుకు ""కొడతారు ?

తుంటరి జవాబు :..అంటే మళ్ళీ మొదట్నీనుంచీ మొదలు పెడతారని.

******

కొంటె కొశ్శెన్ :పొయ్యిలోణి పిల్లి కదల్లేదు అంటే అర్థం ఏమిటి ?

తుంటరి జవాబు :ఆ ఇంట్లో ఎలుకలు అస్సల్లెవని.